స్నాప్ చాట్ లో పరిచయం…ఇంటికి వచ్చి అఘాయిత్యం

by Kalyani |
స్నాప్ చాట్ లో పరిచయం…ఇంటికి వచ్చి అఘాయిత్యం
X

దిశ, రాజేంద్రనగర్ : ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థినికి స్నాప్ చాట్ లో బీటెక్ చదువుతున్న యువకుడు పరిచయమయ్యాడు. రెండు నెలలుగా వారు చాట్ చేసుకున్నారు. యువకుడు ఈరోజు అమ్మాయి ఇంటికి వచ్చి అత్యాచారయత్నం చేశాడు. ఈ సంఘటన అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ బాలిక అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాం పల్లిలో ఉంటుంది. ఆమె ఇంటర్మీడియట్ చదువుతుంది. రెండు నెలల క్రితం స్నాప్ చాట్ లో బీటెక్ చదువుతున్న ఓ విద్యార్థి పరిచయమయ్యాడు. కొన్ని రోజుల వారు స్నాప్ చాట్ చేసుకున్నారు.. మాట్లాడుకున్నారు. ఇలా ఉండగా ఈరోజు బీటెక్ యువకుడు బాలిక ఇంటికి వచ్చి అత్యాచారయత్నం చేశాడు. ఆమె కుటుంబ సభ్యులు వెంటనే అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

Next Story