- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
తాగుబోతులకు అడ్డాగా ఇన్ముల్ నర్వ సర్కార్ బడి.
దిశ, కొత్తూరు : పాఠశాలలు సరస్వతి నిలయాలు అంటారు. ఆ విచక్షణ కూడా మరిచారు కొందరు ప్రబుద్దులు. పాఠశాలలకు వేసవి సెలవులు రావడం, దీంతో పర్యవేక్షణ లేకపోవడంతో తాగుబోతులు ఆ పాఠశాలను తాము తాగడానికి అడ్డాగా మార్చుకున్నారు. వివరాలలోకి వెళితే మండలపరిధిలోని ఇన్ముల్ నర్వ ప్రభుత్వ పాఠశాల వరండాలో తాగి పడేసిన ఖాళీ మద్యం సీసాలు దర్శనమిస్తున్నాయి. చీకటిపడితే చాలు మందుబాబులు పాఠశాల వరండాలో దర్జాగా మద్యం సేవించి ఖాళీ సీసాలు అక్కడే పడేసి పోయారు. వేసవి సెలవుల తర్వాత రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.
ఇలా ఉంటే తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలకు ఎలా పంపిస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా పాఠశాల ఆవరణలో బెంచీలు, పుస్తకాలు అలాగే వదిలివేశారు. సెలవుల్లో అవి ఎండకు ఎండాయి. వానకు నానాయి. ప్రభుత్వ సొమ్ము పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం ఇలా నిర్లక్ష్యంగా వ్యవహారిస్తే ఎలా అని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. 3వ తేది నుంచి ప్రభుత్వం బడిబాట కార్యక్రమం చేపట్టింది. మరి ఉపాధ్యాయులు పాఠశాల వైపు చూడలేదో ఏమో అని వీటిని చూస్తే అనిపిస్తుంది.