కుంట్లూరులో ప్లాట్ల కబ్జాకు యత్నం.. పరిస్థితి ఉద్రిక్తత

by Mahesh |
కుంట్లూరులో ప్లాట్ల కబ్జాకు యత్నం.. పరిస్థితి ఉద్రిక్తత
X

దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో: ఓ మాజీ సర్పంచ్ ప్లాట్ల కబ్జాకు చేసిన ప్రయత్నంతో అబ్దుల్లాపూర్మెట్ మండలం కుంట్లూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పసుమాముల గ్రామ సరిహద్దుల్లో కుంట్లూరు గ్రామ రెవెన్యూ సర్వే నెంబర్ 86,87,88,89 లో ముప్పై మందికి చెందిన ప్లాట్లు ఉన్నాయి. ఆదివారం అర్ధరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు ప్లాట్ల సరిహద్దు రాళ్లకు నలుపు రంగు పెయింట్ వేసి సర్వే నెంబర్లు మార్చారు. దీనిపై సోమవారం ఉదయం ప్లాట్ల యజమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ రౌడీలతో కలిసి ప్లాట్ల కబ్జాకు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపించారు. ఈ మేరకు హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాచకొండ కమిషనర్ కు కూడా ఫిర్యాదు ఇవ్వనున్నట్టు తెలిపారు.

Advertisement

Next Story