- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్రూప్-3 పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి : కలెక్టర్
దిశ ప్రతినిధి వికారాబాద్ : జిల్లాలో ఈనెల 17, 18వ తేదీలలో జరుగనున్న గ్రూప్-3 పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులకు సూచించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి జూమ్ మీటింగ్ ద్వారా మాట్లాడుతూ… గ్రూప్-3 పరీక్షలు జాగ్రతగా నిర్వహించాలన్నారు. చీఫ్ సూపరింటెండెంట్లు ప్రతి సెంటర్ ను విజిట్ చేసి పరీక్ష సెంటర్ లలో సీసీ కెమెరాలు, అవసరమైన పర్నిచర్, లైట్స్, టైయీలెట్స్, డ్రింకింగ్ వాటర్ ఏర్పాట్లతో పాటు విద్యుత్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. నవంబర్ 17న ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3.00 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సెకండ్ సెషన్ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఆ మరుసటి రోజైన 18వ తేదీన మధ్యాహ్నం సెషన్ లో పరీక్ష ఉంటుందని వివరించారు.
బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే కేంద్రాలకు చేరుకునేలా చూడాలన్నారు. ఉదయం పరీక్షకు సంబంధించి 9.30 గంటల వరకే పరీక్షా కేంద్రంలోనికి వెళ్లేందుకు అనుమతించడం జరుగుతుందని, మధ్యాహ్నం పరీక్షకు సంబంధించి 2.30 తరువాత ఎవరినీ లోనికి అనుమతించకూడదని స్పష్టం చేశారు. చీఫ్ సూపరింటెండెంట్ కు తప్ప మరెవ్వరికి పరీక్షా కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్ అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకువెళ్లేందుకు అనుమతి లేదని, ఈ మేరకు ప్రతి కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని సూచించారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షలను ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా, సజావుగా జరిపించాలని సూచించారు. ప్రశ్నపత్రాల లీకేజీలు, మాల్ ప్రాక్టీస్ వంటి వాటికి ఆస్కారం లేకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రశ్న పత్రాలు, ఇతర పరీక్షా సామాగ్రిని పోలీసు బందోబస్తు మధ్య స్ట్రాంగ్ రూమ్ నుంచి ఎగ్జామినేషన్ సెంటర్స్ కు తరలించాలన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతో పాటు పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లోని జిరాక్స్ సెంటర్ లను మూసి ఉండేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. ఈ జూమ్ మీటింగ్ లో జిల్లా అదనపు కలెక్టర్ సుదీర్, అసిస్టెంట్ కలెక్టర్ ఉమా హారతి, అడిషనల్ ఎస్పీ రవీందర్ రెడ్డి, అబ్జర్వర్లు, మున్సిపల్ కమిషనర్ జాకీర్ అహ్మద్ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.