బొక్కల కంపెనీ రద్దుకు ప్రభుత్వం చర్యలు..

by Sumithra |   ( Updated:2023-03-08 09:27:57.0  )
బొక్కల కంపెనీ రద్దుకు ప్రభుత్వం చర్యలు..
X

దిశ, యాచారం : కాలుష్యాన్ని , దుర్వాసనలను వెలువరిస్తు మండలంలోని కొత్తపల్లి గ్రామంలోని ఆగ్రోఫీడ్స్ కంపెనీ పేరుతో చలామణి అవుతున్న బొక్కల కంపెనీని మూసివేస్తున్నట్లు ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బుధవారం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొక్కల కంపెనీ శాశ్వత రద్దుకు ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించినట్లు తెలిపారు.

ఈ బొక్కల కంపెనీ గురించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడానని బొక్కల కంపెనీ లైసెన్స్ రద్దు చేసి, కంపెనీని శాశ్వతంగా అక్కడి నుంచి తీసివేయాలని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజల కోరిక మేరకు ఈ కంపెనీ మూసివేయాలని తాను చేసిన ప్రతిపాదనకు ప్రభుత్వం సానుకూలంగా ఉత్తర్వులు జారీచేసినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు వర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Next Story