- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రంగారెడ్డికి మరో నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు

దిశ, రంగారెడ్డి బ్యూరో: స్ధానికులకు ఆరోగ్య సౌకర్యం అందుబాటులో ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఏర్పడిన మండలాలకు ఆరోగ్య కేంద్రాలను మంజూరు చేశారు. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఏర్పడిన నూతన మండల కేంద్రాల్లో పీహెచ్సీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో కడ్తాల్, గండిపేట్, చౌదరిగూడతో పాటు ఫోర్త్ సిటీలో భాగమైన మీర్ఖాన్ పేట్లో నిర్మాణం చేయాలని ప్రతిపాదనలు పంపించారు. అయితే ఇప్పటికే మీర్ఖాన్పేట్ రెవెన్యూ గ్రామంలో హెల్త్ కమ్యూనిటీ సెంటర్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మిగిలిన మూడు పిహెచ్ఎసీల నిర్మాణానికి స్థల సేకరణ చేయనున్నారు. అందుకోసం వైద్యారో గ్య శాఖాధికారి జిల్లాలెక్టర్ కు మూడు పీహెచ్సీలపై నివేదిక సమర్పించారు. రంగారెడ్డి కలెక్టర్ నారాయణరెడ్డి స్థానిక తహశీల్దార్లకు భూసేకరణ చేయాలని ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. వికారాబాద్ జిల్లాలో చౌడపూర్, దుద్వాల మండలాల్లో కూడా పీహెచ్సీ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ ప్రతీక్ జైన్ తహశీల్దార్లను భూసేకరణ చేయాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఇంకెన్నాళ్లు కాలయాపన..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన మొదటి సారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన రెండేండ్ల కాలంలో ప్రజలకు పరిపాలన అందుబాటులో ఉండాలని జిల్లాలు, మండలాలను కొత్తగా ఏర్పాటు చేశా రు. కానీ ఏర్పాటు చేసిన మండల కేంద్రాల్లో అత్యవసరంగా విద్య, వైద్యారో గ్యం, అనువైన సిబ్బందిని ఏర్పాటు చేయాలి. కానీ పరిపాలన సౌలభ్యం కోసం ఏర్పాటు చేసిన మండలాలు, జిల్లాలో ఇప్పటి వరకు వైద్యారోగ్యా కేంద్రాలు, ఉన్నత విద్య అవకాశాలు అందుబాటులోకి రాకపోవడం బాధాకరం. ఇప్పటికైనా నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరితగతిన నూతన మండల కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు తక్షణమే కల్పించాలని స్ధానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ఒక్కో పీహెచ్సీ నిర్మాణానికి రూ.1.40కోట్లు..
నూతనంగా నిర్మించే పీహెచ్సీలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఒక్కో పీహెచ్సీకి రూ.1.40 కోట్ల చొప్పున నిధులను మంజూరు చేసింది. రంగారెడ్డి జిల్లాలో నాలుగు పీహెచ్సీలకు మొత్తం రూ.5.60 కోట్లు మంజూరు చేసింది. వాస్తవంగా గత ప్రభుత్వంలో మూడు పీహెచ్సీలు మాత్రమే ఉండేవి. చౌదరిగూడ, కడ్తాల్, గండిపేట్ నూతనంగా ఏర్పడిన మండలాలు. ఈ మండలాలకే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఫోర్త్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సందర్భంలో హెల్త్ కమ్యూనిటీ సెంటర్ ఏర్పాటు చేయాలని భావించారు. ఈ నాలుగు పీహెచ్సీలకు మంజూరు చేసిన నిధుల్లో సగం నగదు వైద్యారోగ్య శాఖ ఖాతాలో పడిందని అధికారులు వివరించారు. తక్షణమే భూసేకరణ చేసి పీహెచ్సీ నిర్మాణానికి శంకుస్థాపన చేయాలని భావిస్తున్నారు.