MLA Shankar : రైతు రుణమాఫీలో నిర్లక్ష్యం వద్దు

by Sridhar Babu |
MLA Shankar : రైతు రుణమాఫీలో నిర్లక్ష్యం వద్దు
X

దిశ,షాద్ నగర్ : రైతు రుణ మాఫీ అధికారులు నిర్లక్ష్యం వహించకుండా సాంకేతిక లోపాలను గుర్తించి వెంటనే అర్హులైన రైతులకు రుణ మాఫీ జరిగేలా చూడాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కోరారు. గురువారం షాద్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ, బ్యాంకు అధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. 12 డిసెంబర్ 2018 నుంచి 2024 మధ్య రుణాలు తీసుకున్న ప్రతి ఒక్కరికి రుణమాఫీ వర్తిస్తుందని, రుణమాఫీ కార్యక్రమం మొదటి విడతలో

నియోజకవర్గంలోని 13, 468 మందికి రుణమాఫీ వర్తిస్తుందని అట్టి రైతులకు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు సకాలంలో రైతులకు చెల్లించాలని బ్యాంకు అధికారులను కోరారు. ఈ విషయంలో ఎవరైనా రైతుల అకౌంట్ లో డబ్బులు జమ కాని సందర్భంలో సంబంధిత మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు ఖాతాకు రుణమాఫీ డబ్బులు జమ కాకపోవడానికి గల కారణాలను తెలుసుకోవడం కోసం సంప్రదించాలని రైతులను కోరారు. పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులు ఆందోళన చెందవద్దని సాంకేతిక సమస్యల కారణంగా రైతుల ఖాతా నెంబర్ కు ముందు సున్నా రాని కానీ కారణంగా 546 మంది రైతులకు పంట రుణమాఫీ డబ్బులు కాలేదని ఇట్టి విషయాన్ని త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ రాజారత్నం తదితరులున్నారు.



Next Story