- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో డయాలసిస్ సెంటర్ ప్రారంభం..
దిశ, షాద్ నగర్: షాద్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారు రూ. 60 లక్షల వ్యయంతో 5 మెషీన్ లు ఏర్పాటు చేసిన డయాలసిస్ సెంటర్ ను ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ప్రారంభించారు. ఈ సంధర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. షాద్ నగర్ లో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల డివిజన్ ఏరియాలో ఉన్న ఆరు మండలాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, డయాలసిస్ కోసం హైదరాబాదుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారందరూ డయాలసిస్ సెంటర్ ఉపయోగించుకొని వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు.
డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు సహకరించిన సీఎం కేసీఆర్, హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, ఎంపీపీ ఖాజా ఇద్రీస్, జడ్పీటీసీ వెంకటరామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజన్, మున్సిపల్ కమిషనర్ వెంకన్న, ఎంపీడీవో వినయ్ కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ జయలక్ష్మి, షాద్ నగర్ ప్రభుత్వ వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.