- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్
దిశ శంషాబాద్ : గ్రామాల అభివృద్ధే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యం అని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని నర్కుడ, చౌదరి గూడ గ్రామాలలో 3 కోట్ల 47 లక్షల నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మంగళవారం ఎంపిపి జయమ్మ శ్రీనివాస్, జెడ్పీటీసీ నీరటీ తన్వీరాజ్ తో కలిసి ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో రాష్ట్రం అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్ని నిధులైన ఇచ్చి గ్రామాలను పట్టణాలతో సమానంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. గ్రామాల అభివృద్ధి కొరకు పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టి గ్రామాలలో త్రాగునీరు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, స్మశాన వాటికలు, పాఠశాలలో అదనపు తరగతి గదులు ఇలాంటి వివిధ మౌలిక వసతుల కల్పన కొరకు కృషి చేస్తూ అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా చేయడం లేదన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు తెలంగాణలో జరుగుతున్న, అభివృద్ధిని చూసి ఇక్కడ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కూడా ఇతర రాష్ట్రాల్లో అమలు చేసుకుంటున్నాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. గ్రామాలలో ఇంకా మిగిలి ఉన్న పనులు అంచలంచలుగా అభివృద్ధి చెప్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి నీలం మోహన్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ గౌడ్,పిఎసిఎస్ చైర్మెన్లు బుర్కుంట సతీష్,దవనాకర్ గౌడ్, సర్పంచులు సునిగంటి సిద్దులు, రాజ్ కుమార్, దండు ఇస్తారి, రాంగోపాల్, రమేష్ యాదవ్, ఎంపిటీసి గౌతమి అశోక్, నాయకులు నీరటీ రాజు ముదిరాజ్, మోహన్ రావు, రాజశేఖర్ గౌడ్, యాదగిరి రెడ్డి, గుడాల కృష్ణ గౌడ్, శ్రీనివాస్, విశ్వనాధం, నీరటీ శేఖర్,మల్లేష్ ముదిరాజ్, కృష్ణ, కుమార్ గౌడ్, రాము నాయక్,ప్రభు సాగర్, శివాజీ,మహేష్, కిట్టు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.