- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చైర్మన్, వైస్ చైర్మన్ ల వైఖరికి నిరసనగా సమావేశాన్ని బహిష్కరించిన కౌన్సిలర్లు..
దిశ, అబ్దుల్లాపూర్మెట్ : పెద్ద అంబర్పేట మున్సిపల్ చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్, మున్సిపల్ కమిషనర్ల వైఖరిని నిరసిస్తూ పలువురు కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. పూర్తి వివరాల్లోకి వెళితే శుక్రవారం పెద్ద అంబర్పేట మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. చైర్ పర్సన్ అధ్యక్షతతో మొదలైన ఈ సమావేశంలో పలుఅంశాలు చర్చకు తీసుకువచ్చారు. కేవలం చైర్ పర్సన్, వైస్ చైర్పర్సన్లు కొంతమంది కౌన్సిలర్ల అనుకూల అంశాలను మినహా ఇతర సభ్యుల అంశాలను ఎజెండాలో చేర్చడం లేదని ఆరోపించారు. జిల్లా ఉన్నతాధికారులు సూచించిన అంశాలను ఎజెండాలో ఉంచాలని సూచించినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. చైర్ పర్సన్ వైస్ చైర్ పర్సన్ లు చెప్పిన విధంగా కమిషనర్ నడుచుకుంటున్నాడని కౌన్సిలర్ లుగా తమ సమస్యలు పట్టించుకోవడంలేదని అన్నారు.
అభివృద్ధిని అడ్డుకోవడం కోసం చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ ప్రజలు గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. అభివృద్ధి కోసం అందరినీ కలుపుకుపోయి అభివృద్ధి చేయాల్సిన చైర్పర్సన్, వైస్ చైర్ పర్సన్లు ఏకపక్షంగా వ్యవహరిస్తూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. అనంతరం సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరిస్తూ కార్యాలయం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి మెజార్టీ కౌన్సిల్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సిద్ధంకి కృష్ణారెడ్డి, శ్రీధర్ రెడ్డి, పరుశురాం, కోటేశ్వరరావు, హరిశంకర్, రాజేందర్, లక్ష్మణ్, దండం కృష్ణారెడ్డి, గ్యారాల శ్రీనివాస్ గౌడ్, చల్లూరి మురళీధర్ రెడ్డి, పండుగల జయశ్రీ, పాశం అర్చన, వడ్డేపల్లి విద్యావతి, కందాడ అనుపమ, రోహిణి రెడ్డి తదితరులు ఉన్నారు.