- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బాణసంచాపై నిషేధం అత్యవసరం

- ఢిల్లీలో ఏడాది పొడవునా నిషేధం
- గ్రీన్ క్రాకర్స్‌కు కూడా అనుమతి లేదు
- ప్రతీ ఒక్కరికి కాలుష్యరహిత వాతావరణ హక్కు ఉంది
- వెల్లడించిన సుప్రీంకోర్టు
దిశ, నేషనల్ బ్యూరో: దేశరాజధాని ఢిల్లీలో ఏడాది పొడవునా బాణసంచాపై నిషేధం అమలులో ఉంటుందని పేర్కొంది. బాణసంచా తయారీ, నిల్వ, అమ్మకంపై ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యం స్థాయి ఆందోళనకరంగా ఉన్నాయి. ఈ నిషేధంపై ఎట్టి పరిస్థితుల్లోనూ సడలింపు ఇవ్వబోమని జస్టిస్ అభయ్ ఓకా, ఉజ్జల్ భుయాన్‌తో కూడాని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ఢిల్లీ జనాభాలో ఎక్కువ మంది రోడ్లపైనే పని చేస్తున్నారు. వారందరూ తమ నివాసంలో లేదా పని ప్రదేశంలో ఎయిర్ ప్యూరిఫయ్లను కొనుగోలు చేయలేరు. వాయు కాలుష్యం సామాన్యులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఊహించవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రతీ ఒక్కరికి ఆరోగ్య హక్కు ఉంది. అలాగే కాలుష్యరహిత వాతావరణంలో జీవించే హక్కు కూడా దీని ద్వారా సంక్రమించింది. ఇది చాలా ముఖ్యమైనదని సుప్రీంకోర్టు పేర్కొంది.
గ్రీన్ క్రాకర్స్‌ను కూడా నిషేధం నుంచి మినహాయించబోమని.. వాటి ఉద్గారాలు సాంప్రదాయ బాణసంచా కంటే 30 శాతం మాత్రమే తక్కువగా ఉన్నాయని గతంలోనే కేంద్ర ప్రభుత్వం నివేదిక ఇచ్చిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ మండలి గతేడాది అక్టోబర్ 14 నుంచి 2025 జనవరి 1 వరకు అన్ని కాల బాణసంచా ఉత్పత్తి, నిల్వ, అమ్మకం, వాడకంపై నిషేధం విధించింది. అయినా సరే దీపావళి సమయంలో ఢిల్లీ నగరంలో ఫైర్ క్రాకర్స్‌ను వినియోగించారు. నవంబర్ 1న పండుగ తర్వాత ఢిల్లీ వాయు కాలుష్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన సురక్షిత పరిమితికి 14 రెట్లు ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
గతేడాది నవంబర్ 4న దేశ రాజధానిలో బాణసంచాపై శాశ్వత నిషేధాన్ని అమలు చేయాలని ఢిల్లీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు కోరింది. కానీ ఇది అమలు చేయలేదు. నవంబర్ 11న సుప్రీం ధర్మాసనం మరోసారి దీనిపై విచారణ చేపట్టింది. ఏ మతమైనా కాలుష్యానికి కారణమయ్యే కార్యాకలాపాలను ప్రోత్సహించవద్దని పేర్కొంది. ఢిల్లీ ప్రభుత్వం బాణసంచాపై నిషేధం అమలు చేయడంలో విఫలమైందని మండిపడింది.అయితే ఏడాది పొడవునా నిషేధం విధించామని ఢిల్లీ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. పొరుగు రాష్ట్రాలైన యూపీ, హర్యానా.. వాటిలోని కొన్ని ప్రాంతాలను దేశ రాజధానిలోచేర్చినట్లయితేనే ఈ నిషేధాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేయగలమని సుప్రీం ధర్మాసనానికి తెలిపింది.