ఫ్లాష్.. ఫ్లాష్.. మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు మృతి.. కారణం ఇదే..

by Bhoopathi Nagaiah |   ( Updated:2025-04-14 10:37:25.0  )
ఫ్లాష్.. ఫ్లాష్.. మహబూబ్ నగర్ జిల్లాలో ముగ్గురు మృతి.. కారణం ఇదే..
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో: మహబూబ్ నగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. మహబూబ్ నగర్ మండల పరిధిలోని దివిటిపల్లి డబుల్ బెడ్ రూములకు చెందిన ముగ్గురు సోమవారం మధ్యాహ్నం తమ ఇళ్లకు సమీపంలో ఉన్న పొలంలో ఈత నేర్చుకోవడానికి వెళ్లారు. ముగ్గురికి ఈత రాకపోవడంతో విజయ్, అయ్యప్ప, మహమూద్ అనే వ్యక్తులు నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. అక్కడే ఉన్న కొంతమంది విజయ్ మృతదేహాన్ని బయటకు తీయగా.. మిగతా ఇద్దరి మృతదేహాలు నీటిలోనే ఉండిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు.



Next Story

Most Viewed