- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Etala Rajender: ప్రజలను నమ్మించి మోసం చేయడంలో కాంగ్రెస్ దిట్ట
దిశ శంషాబాద్ : ప్రజలను నమ్మించి మోసం చేయడంలో కాంగ్రెస్ దిట్ట అని పార్లమెంట్ సభ్యులు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. రంగారెడ్డి జిల్లా బిజెపి విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం, రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు బొక్క నరసింహ రెడ్డి అధ్యక్షతన శనివారం శంషాబాద్ మున్సిపాలిటీ తొండుపల్లిలోని ఎమ్మెస్ గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీ బుర్ర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే కేసు రత్నం పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ 66 హామీలతో 420 రకాల పనులతో అడ్డదారిన అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశంలో వారి దొంగతనం బయటపడిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారన్నారు. ఎన్నికల సమయంలో రెండు లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు రుణమాఫీ చేయకుండా 7,000, 6,000 రైతుల అకౌంట్లో జమ చేసి కుంటి సాకులు చెబుతూ ఎన్నో ఆంక్షలు పెట్టి రైతులను ఇబ్బంది పెడుతున్నారన్నారు.
తెలంగాణ ప్రజలంతా బాధపడుతున్నారని రేవంత్ రెడ్డి మాటలకు మోసపోయి అనవసరంగా ఓట్లు వేసి గెలిపించామని మదన పడుతున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ ప్రజాక్షేత్రంలో విశ్వాసం కోల్పోయాయన్నారు. తెలంగాణ రాష్ట్రంలో విశ్వాసానికి మారుపేరు, ఇచ్చిన మాటకు కట్టుబడే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అన్నారు. ప్రజల పక్షాన నిరంతరం పోరాటం చేస్తామన్నారు. ఇకముందు జరగబోయే అన్ని ఎన్నికలను సీరియస్ గా తీసుకొని గెలుపే లక్ష్యంగా పని చేస్తామన్నారు.
ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ…
బిజెపికి 400 ఎంపీ సీట్లు రాలేదు అన్న బాధ ఉన్న, బిజెపికి 400 సీట్లు రాలేదని ఇతరులు సంతోషంగా ఉన్నారన్నారు. 2047 వరకు వికసిద్ భారత్ ఖాయమని అన్నారు. బడ్జెట్ లో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరిగిందన్నారు. కుల మతాలను రాజకీయ లబ్ధి పొందిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. ప్రజల సమస్యలపై బీజేపీ నిరంతరం ప్రజలకు అండదండలుగా ఉండి పోరాడాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఆచారి, అంజన్ కుమార్ గౌడ్, రాజగోపాల్ గౌడ్, డాక్టర్ ప్రేమ్ రాజ్, బుక్క వేణుగోపాల్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్, ప్రేమేందర్ రెడ్డి, పాపయ్య గౌడ్, తోకల శ్రీనివాస్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, వై శ్రీధర్ చింతల నందకిషోర్, దేవేందర్, వంశీ యాదవ్, బుక్క ప్రవీణ్, రాహుల్, భీమార్జున్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.