Road Repair:నరకానికి దారులుగా చౌడపూర్ మండల రోడ్లు

by Aamani |
Road Repair:నరకానికి దారులుగా చౌడపూర్ మండల రోడ్లు
X

దిశ,కుల్కచర్ల : చిన్న వర్షం పడితే చాలు రోడ్డంతా జలమయమవుతుంది .చౌడపూర్ మండల కేంద్రం నుండి విఠలాపూర్,జాకారం వరకు మండల పరిధిలోనీ గుబ్బడితండా,హిర్లవాగు తాండ,హర్యానాయక్ తండా కు వెళ్లే రోడ్ అంతా గుంతలు గుంతలు గా ఏర్పడి, అధ్వానంగా మారడంతో వాహనదారులు,ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.నిత్యం వందల సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉండే ప్రధాన ఆర్‌ అండ్‌ బీ రహదారులు సైతం దెబ్బతిని అద్వానంగా మారాయి. రోడ్డుకు మరమ్మతులు చేయాలని గతంలో చాలాసార్లు ఆయా గ్రామాల ప్రజలు వేడుకున్న అధికారులు అవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దీనికి తోడు ఎత్తుపల్లాలు గా మారిన రోడ్లలో వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి.రహదారుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దీంతో నిత్యం ఏదొక మార్గంలో వాహన దారులు ప్రమాదాలకు గురవుతున్నారు.రాత్రి సమయాల్లో రహదారుల్లో గుంతలను గుర్తించలేకపోతున్నారు.దీనికితోడు ప్రస్తుతం వర్షాకాలం కావడం పరిస్థితి మరింత ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉందని వాహన దారులు భయబ్రాంతులకు గురవుతున్నారు.

గుంతల మయమైన రోడ్లు ప్రయాణం నరకం..

మండల కేంద్రం నుండి విఠలాపూర్,జాకారం వరకు ఉన్న రహదారి అధ్వానంగా తయారయ్యింది.రోడ్డు వేసి ఏళ్లు గడుస్తున్న మరమ్మతులు చేపట్టకపోవడంతో రాకపోకలకు కష్టంగా మారిందని విఠలాపూర్ గ్రామ నాయకులు పండుగ చెన్నయ్య అన్నారు.అత్యవసర పరిస్థితిలో మండల కేంద్రానికి వెళ్ళాలంటే వెళ్లలేక పోతున్నామని తెలిపారు.రోడ్లు ఇలా ఉంటే ప్రయాణాలు చేసేది ఎలా అని చెన్నయ్య తో పాటు వాహన చోదకులు,గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.రోడ్డుపై వర్షపు నీరు నిలవడంతో ఎక్కడ గుంత ఉందో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి తాత్కాలికంగా గుంతలు పూడ్చి రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిందిగా అధికారులను కోరారు.

రోడ్లు ఇలా....ప్రయాణాలు ఎలా...?

మండలంలో గుబ్బడితండా,హిర్లవాగుతాండా,హర్యానాయక్ తాండ నుండి జాకారం వెళ్లే గ్రామీణ రోడ్లు పూర్తిగా శిథిలమయ్యాయి. శిథిలమైన గతుకుల రోడ్ల పై ప్రయాణాలు చేయడం వాహన చోదకులకు గగనంగా మారిందని నిల్య నాయక్ అన్నారు.సంవత్సరాల క్రితం నిర్మించిన రోడ్లు ఆలనా పాలనా లేక పోవడంతో శిథిలావస్థకు చేరుకుని వాహనాల ప్రయాణాలకు ఏ మాత్రం పనికిరాకుండా పోయాయి అన్నారు.గత ప్రభుత్వ హయాంలో నూతన రోడ్ల నిర్మాణానికి ఇచ్చిన ప్రాధాన్యత పాత రోడ్ల మరమ్మతులకు ఇవ్వకపోవడంతో అవి పూర్తిగా శిథిలమయ్యాన్నారు.ఆ రోడ్ల పై ప్రయాణాలు చేయడానికి వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడనీ నిల్య నాయక్, తదితరులు అన్నారు.

Advertisement

Next Story

Most Viewed