- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉచిత వైద్య శిబిరాలను వినియోగించుకోవాలి.. బడంగ్ పేట్ మేయర్
దిశ, బడంగ్పేట్: ఉచిత వైద్య శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి అన్నారు. ఆదివారం మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లోని జిల్లా పరిషత్ పాఠశాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిమ హాస్పిటల్ సహకారంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, బడంగ్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధులతో ఎక్కువ మంది బాధపడుతున్నారని, మనం తీసుకునే ఆహారం, దిన చర్యలు మన గుండెపై అధిక ప్రభావం చూపిస్తాయని తెలిపారు. ఈసీజీ, 2 డీఈకో, జీఆర్పీఎస్వంటి పరీక్షలకు బయట రూ.3 వేల వరకు ఖర్చు అవుతుందని, కానీ ఇక్కడ ఈ పరీక్షలన్నీ ఉచితంగా నిర్వహించారన్నారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగారు బాబు, చిగిరింత నరసింహారెడ్డి, కార్పొరేటర్లు పెద్దబావి సుదర్శన్ రెడ్డి, బండారి మనోహర్, బాలు నాయక్, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, కార్పొరేషన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుబాన్ యాదవ్, మహిళా అధ్యక్షురాలు అమృత నాయుడు, నాయకులు గట్టు బాలక్రిష్ణ, ఆవుల కృష్ణ, సామ వరుణ్ రెడ్డి, ప్రతిమ హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ శ్వేత డాక్టర్ కుతుబుద్దీన్, ఫరూక్, మార్కెటింగ్ మేనేజర్ విక్రమ్ గౌడ్, రాజ్ కుమార్ యాదవ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.