అందరూ అమాత్యులే... అయినా రోడ్డే లేదు

by Sumithra |   ( Updated:2022-10-23 15:37:36.0  )
అందరూ అమాత్యులే... అయినా రోడ్డే లేదు
X

దిశ, పరిగి : వారి ఊర్లో పదుల సంఖ్యలో ఖద్దర్​ బట్టలేసే మండల లీడర్లే...యాబై శాతానికి పైగా ఇంటికో లేడరే..ఎమ్మెల్యే పీఏ మొదలుకొని, జిల్లా పరిషత్​ కో–ఆప్షన్​, ఏఎంసీ వైస్​ చైర్మన్​ వరకు అందరూ అధికార పార్టీలో పెద్ద పెద్ద పదవులు అనుభవిస్తున్న అమాత్యులే...అయినా తమ ఊరికి రోడ్డేయించాలన్న ఆలోచనతట్టడం లేదా.. అదేదో పది కిలోమీటర్ల రోడ్డు అనుకుంటే పొరపాటు కేవలం కిలోమీటరే.. ఆ..కిలోమీటర్ రోడ్డులో సగం వరకు తెలంగాణ రాష్ర్టం ఏర్పడక ముందు కాంగ్రెస్సోలు వేసిన రోడ్డే ఉంది. కేవలం మిగతా సగం వేసేందుకు 8 ఏళ్లుగా మా ఊరి పెద్ద నాయకులు అపరప్రయత్నాలు చేస్తున్నా ఇంకా రోడ్డు మంజూరే కావడం లేదంటూ గ్రామప్రజలు అనుకుంటున్నారు. నిత్యం ఈ కంకర రోడ్డు, గుంతల రోడ్డులో కార్లేసుకొని ఎగురుతూ, తూలుతూనే ప్రయాణం చేస్తుంటారు. కాని రోడ్డు వేయించాలన్న ఆలోచన వారికి తట్టడం లేదా అంటూ సయ్యద్ పల్లి గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు.

పరిగి మండలంలో రోడ్డు పూర్తిగా కంకర తేలి గుంతల మయంగా మారింది. పరిగి–షాద్​ నగర్ ఆర్ ​అంబ్​ బీ రోడ్డు నుంచి గ్రామంలోకి వెళ్లేందుకు 1.02 కిలోమీటర్ల రోడ్డు ఉంది. ఈ రోడ్డును సుమారు 9 ఏళ్ల క్రింత కాంగ్రెస్​ నాయకుల చొరవతో 20 లక్షల పంచాయతీ రాజ్​ నిధులు వెచ్చించి పావుకిలోమీటర్ల రోడ్డు, మద్యలో కల్వర్టు వేయించారు. మిగతా సగానికి పైగా రోడ్డు కోసం తొమ్మిదేళ్లుగా కంకర రోడ్డులో నడుస్తూ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఎన్నికల సమయంలో నాయకులు రోడ్డు వేయిస్తామని హామీ ఇచ్చి కూడా నెరవేర్చ లేదని మళ్లీ ఎన్నికలే దగ్గరకొస్తున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఎన్నికలు రాకముందే రోడ్డువేయిస్తే మాట నిలుపుకున్న వారవుతారని, ఓట్లు అడిగేందుకు మీకు ముఖం చెల్లుతుందని ప్రజలు అభిప్రాయం వక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed