Shadnagar : షాద్ నగర్ అభివృద్ధిపై అంజన్న మార్క్

by Kalyani |   ( Updated:2023-11-18 12:11:35.0  )
Shadnagar : షాద్ నగర్ అభివృద్ధిపై అంజన్న మార్క్
X

దిశ,షాద్ నగర్ : షాద్ నగర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ తన మార్క్ వేశారు. అసెంబ్లీ ఏర్పడిన నాటి నుంచి సాగిన అభివృద్ధి ఒకవైపు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం సాగిన అభివృద్ధి మరోవైపు. 9 ఏండ్ల పాలనలో ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ సాధించిన అభివృద్ధి ప్రగతి సంక్షేమాలు ఆదర్శంగా నిలుస్తుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా పల్లెల్లో పట్టణాల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనలో అంజయ్య యాదవ్ విజయం సాధించారు. ఉద్యమ నాయకుడిగా పోలీస్ పట్వారి గా ప్రజల, గ్రామాల సమస్యలు తెలిసిన వ్యక్తిగా అంజయ్య యాదవ్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పల్లెలు పట్టణాల రూపురేఖలు మార్చారు. ప్రతిపల్లెకు రోడ్డు సౌకర్యం, మంచినీరు, మెరుగైన వైద్య సేవలు, రైతాంగ సమస్యలు పరిష్కారానికి ఎనలేని కృషి చేశారు. అంజయ్య అంటే అభివృద్ధి అంటే అంజయ్య అనే నానుడిని లిఖించిన ప్రజానేత అంజయ్య యాదవ్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం వలదు.

నియోజకవర్గ అభివృద్ధికి సుమారు 5000 కోట్ల నిధులు

షాద్ నగర్ నియోజకవర్గం లోని వివిధ గ్రామాల్లో అభివృద్ధి సంక్షేమాల కోసం ఎమ్మెల్యేగా అంజయ్య యాదవ్ తన 9 ఏళ్ల సుపరిపాలనలో సుమారుగా 5 వేల కోట్ల నిధులను ప్రభుత్వం నుంచి రాబట్టి పల్లె పట్టణాలకు అభివృద్ధి సంక్షేమాలను అందజేశారు. కళాకారుల కోసం కళాభవనం ఏర్పాటు చేయడంతో పాటు వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా మున్సిపాలిటీ భవన నిర్మాణం ప్రతి ఇంటికి తాగునీరు, రైతుబంధు, రైతు బీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పెన్షన్లు, మహిళా సమాఖ్య భవనాలు, గ్రామపంచాయతీ భవనాలు, ఆసుపత్రిలో మెరుగైన వసతుల ఏర్పాటుకు నిధులు, గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాల సాధనలో అంజయ్య యాదవ్ తనదైన శైలిలో ప్రభుత్వం నుంచి నిధులను రాబట్టారు.

మంచి వ్యక్తిగా కేసీఆర్ వద్ద తనకంటూ ఓ ప్రత్యేక సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు..అంజయ్య యాదవ్ అడిగిందే తడువు అభివృద్ధి సంక్షేమాల కోసం నిధులు మంజూరు చేయడం అందుకు నిదర్శనం. షాద్ నగర్ డివిజన్లో ఆర్డీవో కార్యాలయాని ఏర్పాటు చేయించడంలో అంజయ్య యాదవ్ ఘన విజయం సాధించారు. అదేవిధంగా భక్తుల కొంగు గంగారమై మతాలకు అతీతంగా నమ్మి కొలిచే జేపీ దర్గా అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారు. అదేవిధంగా షాద్ నగర్ నియోజకవర్గంలోని అతి పురాతన హిందూ దేవాలయాల అభివృద్ధి కోసం నిధులను సైతం రాబట్టారు. నిరు పేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం, పాత జాతీయ రహదారి విస్తరణ తదితర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నియోజకవర్గ ప్రజల ఆపద్బాంధవుడిగా నిలిచారు.

Advertisement

Next Story

Most Viewed