Summer : ఎండాకాలం మట్టి కుండలో నీళ్ళు తాగితే ఎంత మంచిదో తెలుసా..!

by M.Rajitha |
Summer : ఎండాకాలం మట్టి కుండలో నీళ్ళు తాగితే ఎంత మంచిదో తెలుసా..!
X

దిశ, వెబ్ డెస్క్ : ఎండాకాలంలో రోజు ఉదయాన్నే మట్టికుండలో నీటిని తాగడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా రోజు మూడు నుంచి నాలుగు లీటర్ల మట్టి కుండలో నీటిని తాగడం వల్ల విశేషమైన లాభాలు పొందుతారని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సమ్మర్‌లో మట్టికుండలో నీటిని తాగితే గ్యాస్టిక్ సమస్యలతో పాటు పొట్టకు సంబంధించిన అన్ని సమస్యలు దూరమవుతాయి.

*మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. మట్టి కుండలో నిల్వ చేసిన నీళ్లు తాగటం వల్ల గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా మెరుగవుతుందని ఆయుర్వేద ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు అంటున్నారు.

*వేసవిలో ఎక్కువగా చెమట పడుతుంది. దీంతో జిడ్డు, మొటిమల సమస్య కూడా ఇబ్బంది పెడుతుంది. వీటి నుండి చర్మాన్ని కాపాడుకోవటానికి కూడా మట్టి కుండలో నీళ్లు మంచి ఔషధంగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.. ఇక వేసవిలో చాలా మంది డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. కాగా, మట్టి కుండలోని నీరు ఆ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. వడదెబ్బ తగిలిన వారికి కూడా ఈ నీరు మంచి ఔషధంగా పనిచేస్తాయి.

*మట్టి కుండలో ఉంచిన నీటిని వేసవికాలంలో రోజు రెండు నుంచి మూడు లీటర్లు తాగితే శ్వాసకోశ సంబంధిత సమస్యలు కూడా తగ్గిపోతాయి. సమ్మర్ లో ఎక్కువగా డిహైడ్రేషన్ సమస్యల బారిన పడుతూ ఉంటారు. అయితే ఈ సమస్యలను తగ్గించేందుకు కూడా మట్టికుండలో నీళ్లు క్రియాశీలక పాత్ర పోషిస్తాయి.

*మటి కుండలో ఉంచిన నీళ్లలో సహాజ మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి తాగడం వల్ల శరీరానికి మినరల్స్‌, ఎలక్ట్రోలైట్స్‌ అందుతాయి. బాడీ ఎనర్జిటిక్‌గా ఉంటుంది. కుండలో నీరు తాగితే శరీరానికి రోగనిరోధక శక్తి పెరుగుతుంది. జలుబు, దగ్గు, ఆస్తమాతో బాధపడే వాళ్లు కుండ నీళ్లు తాగడం వల్ల.. ఆ సమస్యల నుంచి బయటపడొచ్చు.

గమనిక : పైన ఇస్తున్న సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడినది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం ఇస్తున్న సమాచారం మాత్రమే. పైవార్తలో మీకు ఏవైనా అనుమానాలు ఉంటే నిపుణుల సలహా తీసుకోగలరు.



Next Story

Most Viewed