- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
మరోసారి తేలిపోయిన సింధు.. సుదీర్మన్ కప్‌లో భారత్ క్వార్టర్స్ ఆశలు గల్లంతు

దిశ, స్పోర్ట్స్ : ప్రతిష్టాత్మక బ్యాడ్మింటన్ టోర్నీ సుదీర్మన్ కప్‌లో భారత్ పేలవ ప్రదర్శన చేస్తున్నది. వరుసగా రెండో ఓటమితో క్వార్టర్ ఫైనల్ ఆశలు గల్లంతయ్యాయి. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 1-4 తేడాతో ఓడిపోయింది. తొలి మ్యాచ్‌లో డెన్మార్క్ చేతిలో పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఇండోనేషియాపై కూడా భారత్ పుంజుకోలేకపోయింది. కేవలం ఒక్క గేమ్ మాత్రమే నెగ్గింది. మ్యాచ్‌లో మొదట మిక్స్‌డ్ డబుల్స్ జోడీ ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో భారత్‌కు శుభారంభం అందించారు. మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్‌లో కుషార్‌జాంటో-విడ్జాజా జంటపై 10-21, 21-18, 21-19 తేడాతో గెలుపొందింది. అనంతరం స్టార్ షట్లర్లు పీవీ సింధు, హెచ్ఎస్ ప్రణయ్ ఆ జోరును కొనసాగించలేకపోయారు. వారిద్దరూ మరోసారి విఫలమవడం భారత్‌కు నష్టం కలిగించింది. వర్దాని చేతిలో 21-12, 21-13 తేడాతో సింధు.. క్రిస్టీ చేతిలో 19-2, 21-14, 21-12 తేడాతో ప్రణయ్ ఓటమిని అంగీకరించారు. ఇక, ఉమెన్స్ డబుల్స్‌లో శ్రుతి మిశ్రా-ప్రియా జోడీ, పురుషుల డబుల్స్‌లో హరిహరణ్-రుబాన్ కుమార్ జంట ఓడిపోవడంతో భారత్ మ్యాచ్‌ను కోల్పోయింది. వరుసగా రెండో మ్యాచ్‌లో పరాజయంతో భారత్ గ్రూపు దశలోనే ఇంటిదారిపట్టనుంది. గురువారం చివరి గ్రూపు మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. గ్రూపు డి నుంచి ఇండోనేషియా, డెన్మార్క్ వరుసగా రెండు విజయాలు సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకున్నాయి.