- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఉగ్రదాడి మృతుల కుటుంబాలకు అండగా నిలవాలి: కార్పొరేటర్ల
by srinivas |

X
దిశ, తెలంగాణ బ్యూరో: ఉగ్రవాద దాడుల్లో మరణించిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా నిలవాలని, ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు డిమాండ్ చేశారు. పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రదాడిని నిరసిస్తూ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో అమరవీరుల స్తూపం వద్ద మృతుల కుటుంబాలకు నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు మాట్లాడుతూ.. పాకిస్తాన్ దేశ ద్రోహులను తక్షణమే మట్టికరిపించాలన్నారు. ఉగ్రవాదులను హతం చేసి దేశాన్ని రక్షించాలని కోరారు. కుల మతాలకు అతీతంగా దేశ ప్రజలు ఏకమై తీవ్రవాదాన్ని అంత మొందించేందుకు దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు సామల హేమ, సునీత, పొడావు అర్చన, ప్రసన్నలక్ష్మి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.
Next Story