- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'Mee Seva'ల్లో అదనపు వసూళ్లు.. నిబంధనలు పాటించని నిర్వాహకులు!
దిశ, దోమ: ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పలు రకాల సేవలను ప్రజలకు పారదర్శకంగా, సులభంగా, వేగంగా అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మీ సేవ కేంద్రాలను ఏర్పాటు చేసింది. అయితే వీటిపై పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారాజ్యం వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండల పరిధిలోని పాలేపల్లి గ్రామానికి చెందిన ఓ రైతు తన భూమి డీఎస్ పెండింగ్ కోసం మండల కేంద్రంలోని గణేష్ టీజీ ఆన్‌లైన్ మీసేవ సెంటర్‌లో దరఖాస్తు చేశాడు. అయితే మీ సేవ నిర్వాహకుడు రూ 45 రషీద్ ఇచ్చి రూ.100 వసూలు చేసాడు. మీసేవలో పని కోసం వెళ్లే ప్రతి ఒక్కరూ ఇలాంటి అనుభవాన్నే ఎదుర్కొంటున్నారు. మీ సేవలో ప్రభుత్వం నిర్దేశించిన ఛార్జ్‌కి మించి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అవినీతి అరికట్టాలనే..
ప్రభుత్వం అన్ని రకాల సేవలను ఒకేచోట అందించడంతో పాటు అవినీతిని అరికట్టాలని, ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఉండాలనే ఉద్దేశంతో మీసేవ, టీఎస్ ఆన్‌లైన్ కేంద్రాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో ప్రధానంగా విద్యార్థులకు సంబంధించిన వివిధ ధ్రువీకరణ పత్రాలతో పాటు భూములు, వ్యవసాయానికి సంబంధించిన పత్రాల కోసం ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటారు. ప్రతీ ధ్రువీకరణ పత్రం జారీకి ప్రభుత్వం సర్వీస్‌చార్జీ కింద కొంత మొత్తం ఫీజును నిర్దేశించింది. విద్యార్థులకు ఎక్కువగా నివాసం, కులం, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరమవుతా యి. ప్రభుత్వం వీటికి రూ.45 ఫీజు విధించింది. అయితే విద్యార్థులు, అమాయక రైతుల పరిస్థితిని ఆసరా చేసుకుని అవసరాన్ని బట్టి నిర్వాహకులు ఇష్టారీతిన అదనపు వసూళ్లు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
అదనంగా వసూలు చేస్తే చర్యలు..
ప్రభుత్వం నిర్దేశించిన సర్వీస్ ఛార్జ్ ప్రకారం మీ సేవ సిబ్బంది డబ్బులు తీసుకోవాలని, అధికంగా ఫీజు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదు చేస్తే సదరు మీసేవ కేంద్రంపై తగిన చర్యలు తీసుకుంటామని షాహెదా బేగం, తహసీల్దార్ తెలిపారు.