- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మొయినాబాద్ లో వ్యక్తి దారుణ హత్య
దిశ, మొయినాబాద్ : అప్పు ఇచ్చిన డబ్బులు అడిగాడని వ్యక్తిని గొంతు కోసి హత్య చేసిన సంఘటన రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని అమీర్ గూడ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొయినాబాద్ మండలంలోని అమీర్ గూడ గ్రామానికి చెందిన మేక గూడ మానేయ్యా (50) ఉదయం 11 గంటల సమయంలో తన మోటార్ సైకిల్ పై మొయినాబాద్ వెళ్ళాడు. మధ్యాహ్నం అయినా ఇంటికి తిరిగి రాలేదు. తన భర్త ఎంతకు ఇంటికి రాకపోగా కంగారుపడిన భార్య వారి బంధువు మేక గూడ మల్లేష్ తో తన భర్తకు ఫోన్ చేయించింది.
భర్త ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అనుమానంతో తన భర్త మానయ్యా, రమేష్ అనే వ్యక్తి ఇద్దరు కలిసి ఎప్పుడు కూర్చొని తాగే స్థలంలో వెళ్లి చూడగా పెద్ద మంగళవారం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రీమియర్ ఎంక్లేవ్ వెంచర్ చివరలో మేక గూడ మానేయ్యా విగతజీవిగా పడి ఉన్నాడు. మేక గూడ రమేష్ కు మూడు లక్షలు అప్పుగా ఇచ్చి అడిగినందుకు ఇద్దరు మధ్యలో మాట పెరిగి గొడవ జరగడంతో రమేష్ అతని గొంతు కోసి చంపినట్లు ఒప్పుకున్నాడు. దీంతో నిందితుడు రమేష్ ను పోలీస్ లు అదుపులోకి తీసుకొని హత్యకు గురైన మనెయ్య భార్య మంజుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ లక్ష్మీ రెడ్డి తెలిపారు.