బిల్లులపై సంతకం పెట్టాలంటే 2 శాతం ఇవ్వాల్సిందే

by Mahesh |
బిల్లులపై సంతకం పెట్టాలంటే 2 శాతం ఇవ్వాల్సిందే
X

దిశ, బొంరాస్‌పేట్: బిల్లులపై సంతకాలు పెట్టాలంటే 2% ఇస్తేనే, సంతకాలు పెడతానని అని అన్నాడు పంచాయతీరాజ్ డివిజన్ డీఈ లక్ష్మణ్ రావు. వివరాలలోకి వెళితే, బొంరాస్‌పేట్ మండలంలోని తుంకిమెట్ల గ్రామంలోని స్మశాన వాటికకు వక్ప్‌బోర్డ్ నుంచి 5 లక్షల నిధులు మంజూరు కావడంతో, స్మశాన వాటిక చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించారు. వీటి బిల్లుల చెల్లింపు విషయంలో కాంట్రాక్టర్, డిఈ దగ్గరకు వెళ్ళగా, పై అధికారులకు పర్సంటేజ్ చెల్లించాల్సి ఉంటుంది. కావున 5 లక్షల నిధులకు 2% అంటే 10వేలు డిమాండ్ చేశారు. ముందస్తుగా 2 వేలు లంచంగా తీసుకున్నాడు. ప్రభుత్వం నుంచి మంజూరైన నిధుల చెల్లింపులో డి ఈ అవినీతికి పాల్పడుతూ.. కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో చెల్లించ పోగా, వేధింపులకు గురి చేస్తున్నాడని కోఆప్షన్ మెంబర్ జలీల్ తెలిపారు. తక్షణమే డిఈ పై తగు చర్యలు తీసుకోవాలని, జిల్లా పాలనాధికారికి విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed