ఒవైసీ పూర్వీకులపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు

by GSrikanth |
ఒవైసీ పూర్వీకులపై రాందేవ్ బాబా వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్ఐఎమ్ పార్టీ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై బాబా రాందేవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శనివారం నల్లగొండ ఆర్యసమాజ్ శతాబ్ది ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాందేవ్ బాబా మాట్లాడుతూ.. ఒవైసీ పూర్వీకులు కూడా రుషుల సంతానమే అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒత్తిళ్లు, ఇతర అవసరాల కోసం వారు మతం మారి ఉండొచ్చని కీలక వ్యాఖ్యలు చేశారు. మదర్సాలకు, చర్చీలకు విదేశాల నుంచి వందల కోట్ల ఫండ్స్ వస్తున్నాయి.. కానీ, సనాతన ధర్మ కోసం అదానీ, అంబానీ వంటి వాళ్లు రూ.100 కోట్లు కూడా ఇవ్వడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

మదర్సాలు, మిషనరీలను గురుకులాలుగా మార్చాలని ఈ సందర్భంగా రాందేవ్ బాబా డిమాండ్ చేశారు. బాబర్, ఔరంగజేబు వారసులం అని చెప్పుకునే వాళ్లు ఈ దేశ పౌరులు కానే కాదని అన్నారు. ఈ దేశంలో ఉండే వాళ్లంతా రుషిరుషుల పరంపర అని, ఒవైసీ పూర్వీకులు కూడా రుషులే అని తెలిపారు. చిన్న ఖురాన్, చిన్న బైబిల్ చదవడం కోసం మదర్సాలు, మిషనరీలు ఏర్పాటు చేశారు.. అవే మత మార్పిడులకు కారణమవుతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పతంజలి సనాతన ధర్మం కోసమే ఏర్పాటుయిందని.. మరో ఐదు సంస్థలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

Advertisement

Next Story