- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ కేబినెట్‌లో వారికే మంత్రి పదవులు.. తేల్చిచెప్పిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి..!
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కేబినెట్ విస్తరణపై మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బుధవారం నియోజకవర్గంలో పర్యటించిన రాజగోపాల్ రెడ్డి.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కమిట్మెంట్ ఉన్న నాయకులకే రేవంత్ రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కుతుందని స్పష్టం చేశారు. పార్లమెంట్ ఎన్నికల వల్లే కేబినెట్ విస్తరణ వాయదా పడిందని ఆయన క్లారిటీ ఇచ్చారు. మంత్రి మండలి విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించి హై కమాండ్ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. కాగా, రేవంత్ కేబినెట్‌లో ఖాళీగా ఉన్న ఆరు బెర్తుల కోసం కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పోటీ నెలకొంది.
మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సైతం మినిస్టర్ పోస్ట్ రేసులో ముందు వరుసలో ఉన్నారు. తనకు రాష్ట్ర హోం మంత్రి పదవి కావాలని పలుమార్లు బహిరంగంగానే రాజగోపాల్ రెడ్డి మనసులో మాట బయటపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో భువనగిరి సెగ్మెంట్‌కు ఇంఛార్జ్‌గా వ్యవహరించిన రాజగోపాల్ రెడ్డికి అక్కడ కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామని హై కమాండ్ ఆఫర్ ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. దీంతో భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి విజయం కోసం రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా కృషి చేసి భువనగిరి ఖిల్లాపై కాంగ్రెస్ జెండా ఎగరడంలో కీలక పాత్ర పోషించాడు.
దీంతో రాజగోపాల్ రెడ్డికి మినిస్టర్ పోస్ట్ ఖాయమంటూ ఆయన అనుచరులు ప్రచారం చేశారు. జూన్ చివర్లో ఢిల్లీలో కేబినెట్ విస్తరణపై చర్చలు జరగగా.. ఈ నెల మొదట్లో రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ఉంటుందని.. ఆ లిస్ట్‌లో రాజగోపాల్ రెడ్డి పేరు ఉంటుందని స్టేట్ పొలిటికల్ సర్కిల్స్‌లో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే, నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడం, ఆశావహుల మధ్య పోటీ ఎక్కువగా ఉండటంతో కేబినెట్ విస్తరణను ఏఐసీసీ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కమిట్మెంట్ ఉన్న నేతలకే రేవంత్ కేబినెట్‌లో చోటు దక్కుతుందంటూ రాజగోపాల్ రెడ్డి కామెంట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. మరీ రాజగోపాల్ రెడ్డి మంత్రి కావాలనే కళ నిజం అవుతుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.