- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Raja Singh: ఉగ్రవాదిలా హౌజ్ అరెస్ట్ చేశారు.. బీజేపీ ఎమ్యెల్యే ఆగ్రహం
దిశ, డైనమిక్ బ్యూరో: ఒక ఉగ్రవాది లాగా హౌజ్ అరెస్ట్ చేశారని గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై అసహనం వ్యక్తం చేసిన ఆయన సోషల్ మీడియా వేదికగా వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సికింద్రాబాద్ మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వర్గానికి చెందిన వ్యక్తి ముత్యాలమ్మ విగ్రహం ధ్వంసం చేశారని మీడియాలో వచ్చిందని, దీంతో మా కార్యకర్తలు నిందితులను అరెస్ట్ చేయాలని అక్కడ నిరసన కార్యక్రమం చేపట్టారని తెలిపారు. అయితే ఆలయం వద్దకు వెళ్లేందుకు ప్రజాప్రతినిధులందరినీ అనుమతిస్తున్నారు.
కానీ తనను మాత్రం ఎందుకు ఇలా హౌస్ అరెస్టు చేస్తున్నారో తెలియడం లేదంటూ మండిపడ్డారు. ఉదయం నుంచి తన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించి ఓ ఉగ్రవాదిని అడ్డుకున్నట్టుగా తనను అడ్డుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఘటనలో నిందితులు మానసిక ఇబ్బందులతో బాధపడుతున్నారు లాంటి స్టేట్ మెంట్లు ఇవ్వకుండా నిజనిజాలు బయటపెట్టాలని సీఎం రేవంత్ రెడ్డిని, పోలీసు కమిషనర్‌ని కోరారు. అంతేగాక నిందితుడికి సహాయం చేసిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారని, వారితో పాటు ఈ ఘటనలో ఇంకా ఎంతమంది ఉన్నారో కనిపెట్టి వారిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఇక తనను ఇంకా ఎన్ని రోజులు హౌజ్ అరెస్ట్ చేస్తారో చెప్పాలని, ఇవాళ కాకపోతే రేపు అయినా సంఘటన స్థలానికి వెళ్లి కార్యకర్తలకు మద్దతు తెలుపుతానని రాజాసింగ్ స్పష్టం చేశారు.