Raja Singh: సర్వేకి హిందువులనే పంపాలి.. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్

by Maddikunta Saikiran |   ( Updated:2024-11-07 15:02:55.0  )
Raja Singh: సర్వేకి హిందువులనే పంపాలి..  గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కులగణన సర్వే(Census Survey)లో భాగంగా హిందూ కుటుంబాలు ఉన్న ప్రాంతాల్లో హిందువులనే సర్వేకి పంపాలని గోషామహల్ ఎమ్మెల్యే(Goshamahal MLA) రాజాసింగ్(Raja Singh) గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తమ వద్ద పలు ఏరియాల్లో ముస్లింలను పంపి బెదిరించి సర్వే చేస్తున్నారని ఆయన ఆరోపణలు చేశారు. ప్రభుత్వం చేయాల్సిన పనులు పక్కన పెట్టి అవసరం లేని అంశాలను తీసుకుంటోందని, మూసీ సుందరీకరణ అంశం కూడా అలాంటిదేనని ఫైరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో జీరో అని ధ్వజమెత్తారు. మున్సిపల్ కార్పొరేషన్.. ఒక చెత్త కార్పొరేషన్ లాగా తయారైందని, నిధులు లేక మున్సిపాలిటీల్లో ఏ పని కావడం లేదన్నారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే లక్ష్యం ఎంటో ఇప్పటి వరకు తెలియట్లేదని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఏమైందో ఎవరికి తెలియదని, కాంగ్రెస్ కూడా సర్వే వివరాలు ఢిల్లీకి పంపుతారా లేక ప్రజల్లో పెడతారా చెప్పాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు.

Advertisement

Next Story