- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Raja Singh: ఏం చేసినా శోభాయాత్ర ఆపను.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వం మా పండుగలను టార్గెట్ చేస్తున్నట్లు అనిపిస్తుందని, అన్నీ చోట్ల బంద్ చేస్తే తాను సపోర్టు చేస్తానని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. ర్యాలీలో సౌండ్ సిస్టమ్, టపాసుల వాడకంపై హైదరాబాద్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రాజాసింగ్.. మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన.. సౌండ్ సిస్టమ్ బ్యాన్ చేయాలని అంటున్నారు. కానీ దీనిపై ఆధారపడిన చాలామంది జీవితాలు రోడ్డున పడతాయని అన్నారు. డీజేలో సౌండ్ తక్కువ చేసేందుకు ఒక లాక్ సిస్టమ్ ఉంటుందని, దానిని అమలు చేయాలని నా వ్యక్తిగత సలహా ఇచ్చానని తెలిపారు. దీనిపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందనేది తనకు తెలియదని, కానీ ఏం చేయాలో అది చేయకుండా.. మా పండుగలపై టార్గెట్ చేస్తున్నారని తాను అనుకుంటున్నట్లు చెప్పారు.
మిలాద్ ఉన్ నబీకి ఏ నిర్ణయం తీసుకుంటారో తనకు తెలియదు కానీ మా పండుగలు చాలా ఉంటాయని, అందులో చాలా వాటికి సౌండ్స్ పెట్టాల్సి వస్తుందని తెలిపారు. అలాగే మా పండుగలు ఎలా చేయాలో ఎవరు చెప్పాల్సిన అవసరం లేదని, ఇదివరకు ఎలా జరిగాయో అలాగే జరిపిస్తామని స్పష్టం చేశారు. పోలీసులు సౌండ్ సిస్టమ్ బంద్ చేయాలని చూస్తే అన్ని సౌండ్ సిస్టమ్ లను బంద్ చేయాలని దానికి తాను కూడా సపోర్టు చేస్తానని అన్నారు. అలాగే 2010 నుంచి తాను శ్రీరామ నవమికి పెద్ద సౌండ్ సిస్టమ్ పెట్టి శోభాయాత్ర తీస్తున్నానని, ఇప్పటివరకు ఒక చిన్న ఘటన కూడా జరగలేదని, కొందరు వ్యక్తులు వేరే దగ్గర జరిగిన ఘటనలను తాను ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆపాదిస్తున్నారని ఆరోపించారు. సౌండ్ సిస్టమ్ వల్ల వ్యక్తులు చనిపోతారని తాను ఎక్కడ వినలేదని, ఒక్క బాణాసంచా వల్ల ప్రమాదాలు జరగే అవకాశం ఉందన్నారు.
ముఖ్యంగా పండుగలకు సౌండ్ సిస్టమ్ బ్యాన్ చేయాలని ప్రభుత్వం చూస్తున్నట్లు కనిపిస్తుందని, అలా జరిగితే.. దేవాలయాలతో పాటు సౌండ్ సిస్టమ్ ఉన్న అన్ని చోట్ల బ్యాన్ చేస్తే తన మద్దత్తు ఉంటుందని తెలిపారు. కర్నాటకలో కూడా ఫెస్టివల్స్ లో సౌండ్ సిస్టమ్ బ్యాన్ చేయాలని చూస్తున్నారని, కానీ అక్కడ జరుగుతున్నాయని, అలాగే ఇక్కడ కూడా జరుగుతాయని, కాంగ్రెస్ ఎక్కడ ఉంటే అక్కడ హిందువులపై దౌర్జన్యమేనని వ్యాఖ్యానించారు. ఏ రాష్ట్రంలో కూడా సౌండ్ సిస్టమ్ బ్యాన్ చేయలేదని, ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు పెట్టుకోవచ్చని, అలాగే ఇక్కడ కూడా అదే సిస్టమ్ పెడితే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ఎవరు ఏం చేసినా నేను శోభాయాత్ర సౌండ్ సిస్టమ్ లేకుండా జరపనని, అలాగే బాణాసంచా బ్యాన్ చేయాలని కూడా చూస్తున్నారని, మా పండుగలు ఎలా జరగాలో అలాగే జరుగుతాయని, బాణాసంచా కూడా కాలుస్తామని స్పష్టం చేశారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి ఇందులో జోక్యం చేసుకొని.. అందరికీ ఉపయోగపడేలా మంచి నిర్ణయం తీసుకోవాలని రాజాసింగ్ కోరారు.