Raja Singh: బీజేపీ సభ్యత్వం తీసుకుని.. మా కాళ్లమీద పడతావ్: ఓవైసీపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2025-03-15 09:33:02.0  )
Raja Singh: బీజేపీ సభ్యత్వం తీసుకుని.. మా కాళ్లమీద పడతావ్: ఓవైసీపై ఎమ్మెల్యే రాజాసింగ్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో బీజేపీ అధికారంలోకి వస్తే మొదట రాష్ట్రాన్ని విడిచి పారిపోయేది అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi)నే అని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Rajasingh) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఇవాళ ఆయన మీడియాకు ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియో రాజాసింగ్ మాట్లాడుతూ.. దేశంలో ప్రతి రాష్ట్రంలో శుక్రవారం హోలీ సెలబ్రేషన్స్ (Holi Celebrations) గ్రాండ్‌గా జరిగాయని అన్నారు. కానీ, హైదరాబాద్‌లో మాత్రం హోలీ పండుగను డిస్టర్బ్ చేసేందుకు ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (MP Asaduddin Owaisi) శతవిధాలా ప్రయత్నించాడని ఫైర్ అయ్యారు. ఓ మసీదులో జుమ్మేకి నమాజ్ (Friday Prayer) పేరుతో బహిరంగ సభ నిర్వహించారని తెలిపారు. ‘తాము భయపడే వ్యక్తులు కాదని, అలాంటి వారు ఎప్పుడో పాకిస్థాన్ (Pakistan) పారిపోయారని.. తాము ఇక్కడే ఉండి కొట్లాడుతామంటూ ఓవైసీ పవిత్ర రంజాన్ మాసంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యల చేశారని రాజాసింగ్ ఫైర్ అయ్యారు.

ఓవైసీ ఎలా భయపెట్టాలో తనకు తెలుసని.. తెలంగాణ (Telangana)లో బీజేపీ సర్కార్ (BJP Government) వస్తే.. మొదటి పారిపోయేది అతడేనని కామెంట్ చేశారు. ఒక వేళ పారిపోవడానికి చేతకకపోతే.. బీజేపీ (BJP) సభ్యత్వం తీసుకుని తమ కాళ్లపై పడతాడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది ఫాల్తూగాళ్లు పార్టీ నుంచి వెళ్లిపోతే తమ పార్టీ అధకారంలోకి రావడం పక్కా అని అన్నారు. హోలీ సందర్భంగా సీఎం యోగి ఆదిత్యనాథ్ (CM Yogi Adityanath) జుమ్మేకి నమాజ్ ఇంట్లో చదువుకోవాలని పిలుపునిస్తే.. యోగి నేర్పించాలా నమాజ్ (Namaz) ఎక్కడ చదవాలో అంటూ కామెంట్ చేయడం ఓవైసీ అహంకారానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. దేశంలో మతకల్లోలాలు జరిగితేనే తన పార్టీ బలపడుతుందని ఓవైసీ భావిస్తున్నారని ధ్వజమెత్తారు. అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi)కి మెంటల్ ఎక్కిందని.. వెంటనే ట్రిట్‌మెంట్ ఇప్పించాలని ఆయన కొత్త మిత్రుడు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)ని రిక్వెస్ట్ చేస్తున్నా అంటూ రాజాసింగ్ కామెంట్ చేశారు.

Next Story

Most Viewed