- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జనగాంకు KCR హామీల వర్షం.. అధికారంలోకి వచ్చిన నెలలోనే ఆ పని చేస్తామని ప్రకటన
దిశ, వెబ్‌డెస్క్: జనగాంకు సీఎం కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. సోమవారం జనగాంలోని మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో బీఆర్ఎస్ తలపెట్టిన ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జనగాం నుండి బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపిస్తే అధికారంలోకి వచ్చిన నెలలోనే చేర్యాలను రెవిన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జనగాంలో మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్, పారా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. త్వరలోనే జనగాంకు దేవాదుల, కాళేశ్వరం నీళ్లు వస్తాయని తెలిపారు.
కొత్త జిల్లాల ఏర్పాటులో ఎన్నో అంశాలు పరిగణలోకి తీసుకున్నామని.. భవిష్యత్‌లో జనగామ అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా కేసీఆర్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కేసీఆర్ కోరారు. ఎన్నికల సమయంలో వచ్చి నోటికి వచ్చినట్లు మాట్లాడి పోయే వాళ్ల మాటలు నమ్మెద్దని.. ఎన్నికలు రాగనే ఆగం కావొద్దని.. మంచి చెడు ఆలోచించి ఓటు వేయాలని కేసీఆర్ సూచించారు. ఇక, ఈ సభలోనే మాజీ కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేసీఆర్ కండువా కప్పి పొన్నాలను పార్టీలోకి ఆహ్వానించారు.