- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ శుభాకాంక్షలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎన్నికైన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ మేరకు సోషల్ మీడియాలో సోనియా, ప్రియాంకతో రేవంత్ దిగిన ఫొటోలను పోస్టు చేస్తూ రాహుల్ విషెస్ చెప్పారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను సమగ్రంగా అమలు పరచడంతో పాటు ప్రజా ప్రభుత్వం ఎలా ఉంటుందో ప్రజలకు చూపిస్తామని హామీ ఇచ్చారు.
మరోవైపు తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా రేపు హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లను చకచకా పూర్తి చేస్తున్నారు. ఈ ఏర్పాట్లను రాష్ట్ర సీఎస్ శాంతి కుమారి, రాష్ట్ర డీజీపీ రవి గుప్తా, సీపీ సందీప్ శాండిల్యాతో సహా పలువురు ఉన్నతాధికారులతో కలిసి పరిశీలించారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంట నాలుగు నిమిషాల ప్రాంతంలో ఎల్బీ స్టేడియంలో నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు.
Congratulations to Telangana’s CM Designate, @revanth_anumula.
— Rahul Gandhi (@RahulGandhi) December 6, 2023
Under his leadership, the Congress govt will fulfill all its Guarantees to the people of Telangana and build a Prajala Sarkar. pic.twitter.com/ExfUlqY8Ic