- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణకు రాహుల్..! పర్యటన ఎప్పుడంటే?
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. రాబోయే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్‌గా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ దూకుడుకు అడ్డుకట్ట వేయాలని చూస్తున్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంపై మరింత ఫోకస్ పెంచింది.
ఇటీవలే ప్రియాంక గాంధీ చేత యువ సంఘర్షణ సభ నిర్వహించగా జూన్ మొదటి వారంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ హైదరాబాద్‌లో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా బోయిన్ పల్లిలో గాంధీ ఐడియాలజీ స్టడీ సెంటర్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు సమాచారం. ఈ మేరకు భవనానికి సంబంధించిన అనుమతి కంటోన్మెంట్ బోర్డు జారీ చేసినట్లు తెలుస్తోంది. అదే రోజు 119 నియోజకవర్గాల నుంచి ఒక్కో యువతికి ఎలక్ట్రిక్ స్కూటీ అందజేయనున్నారు.
తెలంగాణపై నజర్
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ టార్గెట్‌గా ప్రణాళికలు వేస్తోంది. కర్ణాటకలో హస్తం పార్టీకి అనుకూల పవనాలు వీస్తున్నాయన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో జోష్ మీదున్న హస్తం పార్టీ పెద్దలు ఇక తెలంగాణలో తమ ప్రయత్నాలను ముమ్మరం చేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాలను కవర్ చేసే విధంగా పార్టీ కార్యచరణపై దృష్టి సారించబోతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Also Read:
ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ భారీ ప్లాన్.. అన్ని నియోజకవర్గాలను కదిలించేలా వ్యూహం!