అసలేం జరిగింది?.. CM రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్

by Gantepaka Srikanth |
అసలేం జరిగింది?.. CM రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ ఫోన్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఫోన్ చేశారు. నాగర్ కర్నూలు(Nagar Kurnool) జిల్లా దోమలపెంటలోని ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్(SLBC Tunnel) వద్ద జరిగిన ప్రమాద ఘటనపై రాహుల్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. సహాయక చర్యలపై ఆరా తీశారు. కార్మికులు సురక్షితంగా బయటకు వచ్చే వరకూ ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు. ఘటన జరిగిన వెంటనే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులు ఘటనాస్థలికి వెళ్లారని రాహుల్‌కు రేవంత్ తెలిపారు. ఎస్డీఆర్‌ఎఫ్‌(SDRF), ఎన్డీఆర్‌ఎఫ్‌(NDRF) బృందాల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయనీ వివరించారు. మరోవైపు ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో వద్ద సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇందులో 24 మందితో కూడిన ఆర్మీ బృందం పాల్గొంది. ఘటనాస్థలంలో కూలిన మట్టి, నీటితో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది.

మరోవైపు.. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట(Yadagirigutta) పర్యటనకు వెళుతున్నారు. యాదాద్రిలో శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ప్రధాన ఆలయం దివ్య విమాన స్వర్ణ గోపురాన్ని ఆయన స్వామివారికి అంకితం చేస్తారు. ఈ కార్యక్రమానికి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా హాజరుకానున్నారు. ఈ ఉదయం 11.54 గంటలకు మహా కుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవంతో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు.

Next Story