- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: మారణహోమం జరుగుతుంటే రాహుల్ గాంధీ మౌనం: బండి సంజయ్
దిశ, డైనమిక్ బ్యూరో: బంగ్లాదేశ్ లో దారుణమైన మారణహోమం జరుగుతుంటే రాహుల్ గాంధీ ఇప్పటి వరకు మాట్లాడటం లేదని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. తన అంకుల్ శామ్ పిట్రోడా భాష మాట్లాడుతూ.. చైనా విధానాలను, అక్కడి ఆదేశాలను రాహుల్ గాంధీ పాటిస్తున్నారని ఆరోపించారు. ఈ దేశాన్ని వర్గాలు, మతాలు, ప్రాంతాల పేరుతో కాంగ్రెస్ పార్టీ నిలువునా చీల్చిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. నెహ్రు అరాచకం, ఆయన అనాలోచిత నిర్ణయాల వల్ల ఆనాడు లక్షలాది మంది ప్రాణత్యాగం చేశారన్నారు. భారత దేశానికి లభించిన స్వాత్యంత్రాన్ని కాంగ్రెస్ పార్టీ కేవలం నెహ్రు కుటుంబానికి లాభం చేకూరేలా, వారి కుటుంబానికే భజన చేసేలా ఇన్నిరోజులు వ్యవహరించిందని, చరిత్రనే తారుమారు చేయాలని ఆ పార్టీ ప్రయత్నించిందని ఆరోపించారు. అందుకే మహనీయుల చరిత్ర రాబోయే తరాలకు తెలియాలని, వారి త్యాగాలను సమాజానికి చూపించే ప్రయత్నంలో భాగంగానే కేంద్ర ప్రబుత్వం హర్ ఘర్ తిరంగ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఇన్నేళ్లు కాంగ్రెస్ ఇటువంటి ప్రయత్నం చేయలేదని ధ్వజమెత్తారు.
సోమవారం కరీంనగర్ లో భారతీయ యువమోర్చా ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగ యాత్రలో బండి సంజయ్ కుమార్ పాల్గొని మాట్లాడారు. భారత జాతి ఐక్యత చాటేలా మనమంతా ఒక్కటే అనే నినాదాన్ని ప్రపంచానికి చూపించేలా సోషల్ మీడియాలోని డీపీలను మార్చి త్రివర్ణ పతాకం, మహనీయుల ఫోటోలను డీపీలుగా పెట్టుకోవాలని తెలంగాణ యువతకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. అలాగే ప్రతి భారతీయుడు పంద్రాగస్టు రోజున తమ ఇళ్లపై మువ్వన్నెల జెండా ఎగరవేయాలని సూచించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను స్ఫూర్తిగా తీసుకుని నరేంద్ర మోడీ పాలన సాగుతున్నదని, 370 ఆర్టికల్ ను రద్దు చేయడమే దీనికి నిలువెత్తు నిదర్శనం అన్నారు. ఇన్నాళ్లు కాంగ్రెస్ పార్టీ కశ్మీర్ ను భారతదేశంలో అతంర్భాగం కాదని భావించిందని అందువల్లే ఆర్టీకల్ 370ని రద్దు చేయలేదని విమర్శించారు. బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నదన్నారు.