జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న

by Javid Pasha |   ( Updated:2023-04-18 14:27:48.0  )
జైలు నుంచి విడుదలైన తీన్మార్ మల్లన్న
X

దిశ, వెబ్ డెస్క్: క్యూన్యూస్ అధినేత తీన్మార్ మల్లన్న జైలు నుంచి విడుదలయ్యారు. గత నెల 21న పలు సెక్షన్ల కింద మేడిపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆయనకు రిమాండ్ విధించగా.. ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. ఈ క్రమంలోనే ఆయన తరఫు లాయర్లు బెయిల్ కోసం కోర్టుకు పలుమార్లు అప్పీల్ చేశారు. కానీ కోర్టు బెయిల్ మంజూరు చేయలేదు. ఈ క్రమంలోనే నిన్న (ఏప్రిల్ 17న) మల్కాజ్ గిరి న్యాయస్థానంలో మల్లన్న తరఫు లాయర్లు మరోసారి బెయిల్ పిటిషన్ వేశారు. బెయిల్ పిటిషన్ విచారణ జరిపిన కోర్టు.. ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఆయనతో పాటు క్యూన్యూస్ స్టాఫ్ సుదర్శన్ గౌడ్, బండారు రవీందర్, ఉప్పల నిఖిల్, సిర్రా సుధాకర్, చింత సందీప్ కుమార్ లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. ఒక్కొక్కరి వద్ద రూ.20వేల ష్యూరిటీని పూచీకత్తుగా తీసుకుని బెయిల్ మంజూరు చేసింది. ఇక జైలు నుంచి విడుదలైన మల్లన్నకు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. విడుదల అనంతరం మల్లన్న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పోలీస్ సెక్షన్లను నమ్మారని.. కానీ తాము వీకర్ సెక్షన్స్ తో ఉన్నామని చెప్పారు. త్వరలోనే కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నానన్న మల్లన్న.. పార్టీ పేరు తెలంగాణ నిర్మాణ పార్టీ అని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed