- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Pushpa-2: పుష్ప-2 రిలీజ్‌కు లైన్ క్లియర్.. విడుదలను ఆపలేమన్న హైకోర్టు
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ(Telangana)లో పుష్ప-2 సినిమా(Pushpa-2 Movie) విడుదలకు(Release) లైన్ క్లియర్(Line Clear) అయ్యింది. చివరి నిమిషంలో సినిమా విడుదలను ఆపలేమని హైకోర్టు(High Court) స్పష్టం చేసింది. డైరెక్టర్ సుకుమార్(Director Sukumar) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) నటించిన పుష్ప-2 సినిమా పాన్ ఇండియా లెవెల్ లో ఈ నెల 5న రిలీజ్ కానుంది. ఈ సినిమాకి టికెట్ రేట్లను పెంచుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
దీంతో తెలంగాణలో పుష్ప-2 సినిమా టికెట్ చార్జీల పెంపును నిరసిస్తూ.. సినీ ప్రియులు హైకోర్టును ఆశ్రయించారు. బెన్‌ఫిట్ షోకు రూ.800 వసూలు చేస్తున్నారని ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు కీలక వ్యాక్యలు చేసింది. సినిమా విడుదలకు ఎక్కువ గడువు లేదని, చివరి నిమిషంలో సినిమా విడుదలను ఆపలేమని హైకోర్టు తెలిపింది. ఈ పిటిషన్ పై విచారణను రెండు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో తెలంగాణలో పుష్ప-2 సినిమా విడుదలకు ఆటంకాలు తొలిగిపోయాయి.
Read More...
Allu Arjun: మీ నిర్ణయం తెలుగు సినిమా ఎదుగుదలను ప్రోత్సహిస్తుంది.. అల్లు అర్జున్ ట్వీట్