నేడే శ్రీహరి కోట నుంచి నింగిలోకి PSLV-C55

by Sathputhe Rajesh |
నేడే శ్రీహరి కోట నుంచి నింగిలోకి PSLV-C55
X

దిశ, వెబ్‌డెస్క్: శ్రీహరి కోట నుంచి PSLV -55 రాకెట్ నేడు నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు రాకెట్ ప్రయోగం జరగనుందని ఇస్రో అధికారులు తెలిపారు. అందుకు గాను నిన్న 12 గంటల 50 నిమిషాలకు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. నింగిలోకి సింగపూర్ కు చెందిన 741 కిలోల టెలియోస్ -2, 16 కిలోల లూమాలైట్-4 ఉపగ్రహాలను పంపనున్నారు.

అయితే లూమాలైట్ -4 ఉపగ్రహాన్ని సింగపూర్ నేషనల్ వర్సిటీ అభివృద్ధి చేసింది.ఉపగ్రహాలను ఈ ప్రయోగం ద్వారా నిర్దేశిత కక్ష్యలోకి ఇస్రో పంపనుంది. ఈ ఉపగ్రహాలు సింగపూర్ భూ పరిశీలనకు ఉపయోగపడనున్నాయి. PSLV సిరీస్ లో ఇది 57 వ ప్రయోగమని అధికారులు తెలిపారు. ఈ ప్రయోగం తర్వాత GSLV రాకెట్ ద్వారా నావికా ఉపగ్రహ ప్రయోగం ఉంటుందని అధికారులు తెలిపారు. ఆ తర్వాతనే చంద్రయాన్ 3, ఆదిత్య ప్రయోగాలు ఉంటాయని ఇస్రో ప్రకటించింది.

Advertisement

Next Story

Most Viewed