జిల్లాల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం

by GSrikanth |   ( Updated:2023-08-27 14:42:45.0  )
జిల్లాల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీవో నెం. 317లో భాగంగా జిల్లాల వర్గీకరణ విషయంలో ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఉపాధ్యాయలతో పాటు వివిధ శాఖలకు చెందిన ఉద్యోగులు ఎంతో నష్టపోతున్నారని టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొ. కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద జీవో నెం. 317 భాదిత ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ అధ్వర్యంలో "మనోవేదన మహాసభ" నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరయిన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. స్థానిక రిజర్వేషన్ ప్రకారం ఏ జిల్లాల వారికి.. ఆ జిల్లాల్లోనే రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. జీవో నెం.317 విషయంలో స్థానికత ప్రాతిపదిక తీసుకోకుండా సీనియారిటీ ప్రాతిపదికన తీసుకుని ఉద్యోగ ఉపాధ్యాయులను వేధిస్తున్నారని విమర్శించారు.

తెలంగాణలోని 8 జిల్లాలలో ఇదే సమస్య ఉందన్నారు. స్థానికత ఆధారంగా ఏర్పడిన తెలంగాణలో స్థానికత అనే పదం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల ప్రభుత్వం వెంటనే పరిష్కారించాలని కోదండరాం కోరారు. జీవో నెం. 317 నాన్ స్పౌజ్ భాదితులను వారి స్వంత జిల్లాలకు కేటాయించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. స్థానికత ఆధారంగా ఉపాధ్యాయుల కేటాయింపులు చేయాలని కోరారు. సూపర్ న్యూమరీ పోస్టులు క్రియేట్ చేసి జీవో నెం.317 బాధితులకు న్యాయం చేయాలని ఆకాంక్షించారు. జీవో నెం.317 భాదితులు అందరూ కలసి కట్టుగా పోరాడాలని ప్రొఫెసర్ కోదండరాం తెలిపారు. ఈ సందర్బంగా మహిళా ఉద్యోగులు ప్రొఫెసర్ కోదండరాంకు రాఖీలు కట్టి.. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు మాతో పాటు కలసి పోరాడాలని కోరారు.

Advertisement

Next Story

Most Viewed