- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
T- కాంగ్రెస్ వివాదం.. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ప్రియాంకా గాంధీ ఫోన్ కాల్..!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో ముదిరిన కమిటీల కూర్పు వివాదంపై ఆ పార్టీ అధిష్టానం దృష్టి సారించింది. టీ కాంగ్రెస్‌లో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలపై ఆరా తీస్తోంది. ఇప్పటికే ఏఐసీసీ ఇన్ చార్జి కార్యదర్శి నదీమ్ జావిద్ స్టేట్ కాంగ్రెస్‌లోని పరిస్థితులపై ఆరా తీస్తుండగా.. తాజాగా రంగంలోకి ప్రియాంక గాంధీ ఎంటర్ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పరిస్థితిపై ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసిన మాట్లాడినట్టు సమాచారం.
పార్టీలో నెలకొన్న అభిప్రాయ విభేదాలతో పాటు అసమ్మతికి గల కారణాలపై ఆరా తీసినట్టు చర్చ జరుగుతోంది. ఏదైనా సమస్య ఉంటే ఢిల్లీ వచ్చి మాట్లాడాలని సూచించినట్టు టాక్ వినిపిస్తోంది. మరో వైపు రేపు అసమ్మతి నేతలంతా మరోసారి భేటీ కావాలని నిర్ణయించుకోగా ఈ మీటింగ్ ను వాయిదా వేసుకోవాలని ప్రియాంక గాంధీ కోరినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరును ప్రియాంక దృష్టికి తీసుకువెళ్లారనే టాక్ వినిపిస్తోంది.
రాష్ట్రంలో అసంతృప్తితో ఉన్న సీనియర్లతో చర్చలు జరిపేందుకు పార్టీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. సీనియర్లతో సమావేశం కావాలని ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్ జావిద్, బోసురాజు, రోహిత్ చౌదరిలను రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ ఆదేశించగా ఆదివారమే గాంధీభవన్‌లో జరిగిన సమావేశానికి నదీమ్ హాజరయ్యారు. ఇవాళ హైదరాబాద్ రానున్న మిగిలిన ఇద్దరు కార్యదర్శులు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మధుయాష్కి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, జగ్గారెడ్డిలతో పాటు మరికొంత మంది సీనియర్లను భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఈ క్రమంలో నేరుగా ప్రియాంక గాంధీ రంగంలోకి దిగారనే ప్రచారం ఆసక్తిని రేపుతోంది. ఇటీవల హిమాచల్ ప్రదేశ్‌లో పార్టీ గెలుపుకు కృషి చేసిన ఆమె తాజాగా తెలంగాణపై దృష్టి సారించినట్టు ప్రచారం జరుగుతోంది. ఈక్రమంలో టీ కాంగ్రెస్‌లో నెలకొన్న సంక్షోభాన్ని ఆమె ఎలా గట్టెక్కిస్తారనేది హాట్ టాపిక్ అవుతోంది. ప్రియాంక పిలుపుతో త్వరలో పార్టీ సీనియర్లు ఢిల్లీ బాటపట్టనున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :