Breaking: రూ.2 లక్షల రైతు రుణమాఫీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Satheesh |   ( Updated:2024-05-08 14:05:16.0  )
Breaking: రూ.2 లక్షల రైతు రుణమాఫీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చిన రూ.2 లక్షల రైతు రుణమాఫీపై ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం వరంగల్‌లో బీజేపీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికారంలోకి వస్తే సోనియా గాంధీ జన్మదినమైన డిసెంబర్ 9న రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామన్న కాంగ్రెస్.. ఇప్పుడు పంద్రాగస్ట్ వరకు వాయిదా వేసిందని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, మహిళలకు ఇచ్చిన అన్నీ హామీలను కాంగ్రెస్ నిలబెట్టుకుందా అని మోడీ ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టడానికి హామీలు ఇచ్చి మరిచిన కాంగ్రెస్ తెలంగాణకు మేలు చేస్తుందా అని అడిగారు. హిందూ సనాతన ధర్మాన్ని తిట్టేవారిని నమ్మగలమా అని అన్నారు.

తెలంగాణలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూల్ చేస్తున్నారని, ఈ ట్యాక్స్‌లో తొలివాటా హైదరాబాద్‌లోని ‘ఆర్’కి (పరోక్షంగా రేవంత్ రెడ్డి) వెళితే.. రెండో వాటా ఢిల్లీలోని ‘ఆర్’కి (పరోక్షంగా రాహుల్ గాంధీ) వెళ్తుందోని ఆరోపించారు. కాంగ్రెస్, ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలు ఆ పార్టీలకు ఏటీఎంలుగా మారుతాయని ధ్వజమెత్తారు. అమెరికాలో యువరాజు రాహుల్ అంకుల్ పిట్రోడా ఉంటారు. చర్మం రంగు నల్లగా ఉన్నవారు ఆఫ్రికావారాని ఆ ఆంకుల్ చెప్పారు. చర్మం రంగును చూసి తీవ్రంగా తిట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా ఆఫ్రికన్ అనేలా మాట్లాడారని నిప్పులు చెరిగారు. అందుకే కాంగ్రెస్ ముర్మును ఓడించడానికి ప్రయత్నించిందన్నారు. రాష్ట్రపతిగా మేం ద్రౌపది ముర్మును నిలబెడితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించిందో అర్థం కాలేదని అన్నారు.

Read More...

"కాంగ్రెస్ షెహజాదా" వారి నుంచి ఎంత సేకరించారు.. రాహుల్ గాంధీపై మోడీ విమర్శలు

Advertisement

Next Story