- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
లోక్ సభ సాక్షిగా BJP గెలిచే MP సీట్ల సంఖ్య తేల్చిచెప్పిన మోడీ
దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ గెలవబోయే సీట్ల సంఖ్యపై ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగనున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ సొంతంగా 370 ఎంపీ సీట్లు గెలవడం ఖాయమని మోడీ జోస్యం చెప్పారు. అలాగే బీజేపీ నేతృత్వలోని ఎన్డీఏ కూటమి 400 సీట్లు గెలిచి కేంద్రంలో మూడోసారి ప్రభుత్వా్న్ని ఏర్పాటు చేస్తోందని ప్రధాని దీమా వ్యక్తం చేశారు. సోమవారం లోక్ సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడారు. వంద రోజుల్లో కేంద్రంలో మా ప్రభుత్వం మరోసారి ఏర్పడబోతోందని.. ఆప్ కీ బార్ మోడీ సర్కార్ అని అన్నారు.
కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చాక మరిన్నీ సంచలన నిర్ణయాలు తీసుకుంటామని మోడీ తేల్చి చెప్పారు. బీజేపీ మూడో టర్మ్‌లో వేయ్యేళ్ల అభివృద్ధికి పునాదులు వేస్తామని.. మా పాలనను ప్రజలు వేయ్యేళ్లు గుర్తుంచుకుంటురని అన్నారు. మాకు ఓట్లు కాదు.. ప్రజల హృదయాలు గెలుచుకోవడం ముఖ్యమన్నారు. బీజేపీపై పోటీకి విపక్ష నేతలు వణికిపోతున్నారు.. కొంత మంది లోక్‌సభ సీటు మార్చుకుని.. దొడ్డదారిన రాజ్య సభకు వస్తున్నారని కాంగ్రెస్ నేతలను ఎద్దేవా చేశారు. ప్రజలు బుద్ధి చెప్పినా విపక్షాల తీరు మారలేదని.. కాంగ్రెస్ వైఖరి వల్ల దేశానికి, ప్రజాస్వామ్యానికి తీవ్ర నష్టం మోడీ విమర్శలు గుప్పించారు.