- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
న్యూ లుక్‌తో ఎంట్రీ ఇచ్చిన ప్రధానీ..!

దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని బండిపోర్ టైగర్ రిజర్వ్‌ను ప్రధాని మోదీ ఆదివారం సందర్శించడం జరిగింది. ప్రాజెక్టు టైగర్‌కు 50 ఏళ్లు పూర్తైన సందర్భంగా మోదీ ఈ పర్యటన చేశారు. అలాగే పులుల సంరక్షణ చేపట్టిన చర్యలు, జంతువుల కోసం ఏర్పాటు చేసిన నీటి కేంద్రాలు, ఎలెఫెంట్ క్యాంప్స్ తదితర ప్రదేశాలను అధికారులు ప్రధానీకి చూపెట్టనున్నారు. అనంతరం తమిళనాడులోని ముదులై టైగర్ రిజర్వ్ కూడా సందర్శించారు. అయితే మోదీ బందీపూర్, ముదుమలై టైగర్ రిజర్వ్‌కు వెళ్లనున్నారని.. క్యాప్షన్ పీఎంవో పోస్టు చేసింది. దీనికి ప్రధాని ఫొటో కూడా జత చేసింది. ఇందులో ఆయన నల్ల టోపీ, ఖాకీ ప్యాంట్, క్యామోఫ్లాజ్ టీ షర్ట్, బ్లాక్ షూస్ ధరించి... ఒక చేత్తో స్లీవ్ లెస్ జాకెట్ పట్టుకొని స్టైలిష్‌గా కొత్త లుక్‌లో కనిపించారు.
PM @narendramodi is on the way to the Bandipur and Mudumalai Tiger Reserves. pic.twitter.com/tpPYgnoahl
— PMO India (@PMOIndia) April 9, 2023