ఆ అంశంపై 3 సార్లు ప్రెస్‌మీట్.. TSPSC పేపర్ లీక్‌పై డీజీపీ, సీపీ స్పందించరా

by Sathputhe Rajesh |
ఆ అంశంపై 3 సార్లు ప్రెస్‌మీట్.. TSPSC పేపర్ లీక్‌పై డీజీపీ, సీపీ స్పందించరా
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో హైకోర్టుకు సమర్పించిన సిట్ దర్యాప్తు రిపోర్టుపై బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. ఈ కేసులో ఇద్దరే లీకేజీ సూత్రధారులని...ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలే కీలక నిందితులు అని సిట్ దర్యాప్తు రిపోర్టులో పేర్కొనడంపై ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గురువారం ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తున్న సిట్ నుండి ఇంతకన్నా ఎక్కువగా ఏం ఆశించగలం? అని విమర్శలు గుప్పించారు. 10వ తరగతి పేపర్ లీకేజీ జరిగిన 48 గంటల్లోనే వరంగల్ సీపీ 3 సార్లు ప్రెస్‌మీట్ పెట్టారని.. మరి టీఎస్‌పీఎస్సీ స్కాంపై నెల నుండి మీరెందుకు మౌనంగా ఉన్నారు? అంటూ డీజీపీ, హైదరాబాద్ సీపీలను ఆర్ఎస్పీ నిలదీశారు. ముందు లీక్ అయిన దానిపై సరైన దర్యాప్తు లేదని, 10వ తరగతి పేపర్‌పై 48 గంటల్లో నిందితులను జైలుకు పంపడంపై ఆర్ఎస్పీ అనుమానం వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed