యాదాద్రిలో రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు

by Sathputhe Rajesh |   ( Updated:2022-12-30 05:43:34.0  )
యాదాద్రిలో రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక పూజలు
X

దిశ,భువనగిరి రూరల్ /యాదగిరిగుట్ట : శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్ర పర్యటనలో ఉన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము యాదాద్రిలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మంత్రులు జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, సత్యవతి రాథోడ్, విప్ గొంగిడి సునీత, జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి ఘన స్వాగతం పలికారు. రాష్ట్రపతితో పాటుగా గవర్నర్ తమిళ సై కూడా యాదాద్రి‌కి చేరుకున్నారు. యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం పునర్నిర్మాణం అనంతరం మొదటి సారి ఆలయానికి వచ్చిన రాష్ట్రపతి ముర్ము కు ఆలయ పండితులు పూర్ణకుంభం‌తో స్వాగతం పలికారు. అనంతరం గర్భాలయంలో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని ముర్ము దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు సంకల్పం, సువర్ణపుష్పార్చన పూజలు నిర్వహించారు. అనంతరం చతుర్వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ పరిసరాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పరిశీలించారు. పూజల అనంతరం రాష్ట్రపతి కొండ మీద నుండి తిరుగు ప్రయాణమయ్యారు.

Also Read...

BRS పార్టీకి గన్ షాట్ లాంటి నినాదం.. ఎమోషనల్ ట్యాగ్ లైన్ కోసం KCR అన్వేషణ

Advertisement

Next Story

Most Viewed