- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రవళిక మరణం దురదృష్టకరం: మంత్రి కేటీఆర్
దిశ, తెలంగాణ బ్యూరో: ప్రవళిక కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇటీవల హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన యువతి మర్రి ప్రవళిక కుటుంబసభ్యులను బుధవారం ప్రగతిభవన్‌కు పిలిపించారు. వారితో కేటీఆర్ భేటీ అయ్యారు. మృతిగల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రవళిక మృతికి శివరామ్ కారణం అని, అతడిని కఠినంగా శిక్షించాలని మంత్రిని కోరారు. ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రవళిక మరణం దురదృష్టకరమన్నారు.
కుటుంబ సభ్యులను కేటీఆర్ ఓదార్చారు. ఈ బాధాకర సమయంలో ధైర్యంగా ఉండాలని కోరారు. డీజీపీతో మృతి ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు. కేసు విచారణను మరింత వేగంగా పూర్తి చేయాలని డీజీపీకి సూచించారు. ప్రవళిక మృతికి కారణమైన శివరామ్‌కు తగిన శిక్ష పడేలా చూస్తామని అన్నారు. ప్రవళిక సోదరుడికి ఉద్యోగం ఇప్పిస్తానని కుటుంబ సభ్యులకు మంత్రి హామీ ఇచ్చారు. కేటీఆర్ ఇచ్చిన భరోసాకు ప్రవళిక కుటుంబ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు.