- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'గద్దర్‌కు KCR రూ.150 కోట్లు ఇచ్చాడు'
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా గద్దర్‌కు సీఎం కేసీఆర్ రూ.150 కోట్లు ఇచ్చాడని కేఏపాల్ ఆరోపించారు. శనివారం విలేకరులతో మాట్లాడిన ఆయన గద్దర్‌కు భారీగా డబ్బులు ఇచ్చినట్టు తనతో ముగ్గురు కీలక వ్యక్తులు చెప్పారని అన్నారు. అయితే ఇదే విషయాన్ని తాను గద్దర్‌ను అడిగితే తాను ఎవరికీ అమ్ముడు పోలేదని చెప్పారని ప్రజాశాంతిలోనే కొనసాగుతున్నానని తెలిపినట్టు చెప్పారు.
ఖమ్మం బీఆర్ఎస్ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని బీరు, బిర్యానీ పంచినా సభకు జనాలు రాలేదని అన్నారు. పరిపాలన చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విడిపోయాయన్నారు. దేశాన్ని మోడీ అప్పుల్లో ముంచుతుంటే రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాలుచేశారని అన్నారు. ప్రజాశాంతిలో చేరుతామనిచే పెద్ద ఎత్తున మెసేజులు వస్తున్నాయని డాక్టర్లు, లాయర్లు, వంటి వారు పార్టీలో చేరుతామన్నారు. 70 శాతం తెలంగాణ ప్రజలు కేఏపాల్ పరిపాలన కావాలని కోరుకుంటున్నారన్నారు. బీజేపీకి బీ టీమ్‌గా బీఆర్ఎస్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.