- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘అడ్రస్ చెప్పండి మీ వద్దకే అమ్మాయిని పంపుతాం’.. కామారెడ్డిలో సెక్స్ వర్కర్ల పోస్టర్లు..!!
దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలో కొనసాగుతున్న వ్యభిచారంలో బ్రోకర్లు కొత్త పంథాను ఎంచుకున్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటున్నారు. పట్టణంలో విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. నాలుగైదు ప్రాంతాలను అడ్డాలుగా మార్చుకొని వ్యాపారం కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం డబ్బులిస్తే ఎలాంటి అమ్మాయి కావాలన్నా సప్లై చేస్తున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తాజాగా కామారెడ్డిలో జరుగుతున్న వ్యభిచార నిర్వహణలో కొత్త పద్ధతికి శ్రీకారం చుట్టినట్టుగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
నయా ట్రెండ్.. నయా పాలసీ
నయా ట్రెండ్ నయా పాలసీకి వ్యభిచార బ్రోకర్లు శ్రీకారం చుట్టారు. గతంలో ఫలానా చోటకు వెళ్తేనో, ఫలానా వాళ్ళను కలిస్తేనో కోరుకున్న అమ్మాయి, మహిళ దొరికేది. ప్రస్తుతం ఇప్పుడు ఆ పద్ధతికి స్వస్తి పలికారు. కొత్త ట్రెండ్ ప్రకారం ఇంటికే అమ్మాయిని సరఫరా చేస్తున్నారు. దానికోసం కొత్తగా పాంప్లెంట్స్ ముద్రించి వాటిని అక్కడక్కడ అతికిస్తున్నారు. అందులో ఫోన్ నంబర్ కూడా జత చేస్తున్నారు. అమ్మాయి కావాల్సిన వారు ఈ నంబరును సంప్రదించాలని పాంప్లేట్స్‌లో పేర్కొనడం గమనార్హం.
ఎక్కడుంటే అక్కడికే అమ్మాయి
పాంప్లేట్స్‌లో పొందుపరిచిన మొబైల్‌కు "దిశ" ప్రతినిధి ఫోన్ చేయగా.. అతని పేరు ట్రూ కాలర్‌లో భరత్‌గా వచ్చింది. అమ్మాయి కావాలి అని అడిగితే సరే అంటూ కట్ చేసి కొద్దిసేపటి తర్వాత మళ్లీ కాల్ చేసాడు ఆ అమ్మాయిల బ్రోకర్. ఎక్కడికి రావాలి అని అడిగితే మీరు రావాల్సిన అవసరం లేదు. మీ అడ్రస్ చెప్పండి.. అక్కడికే అమ్మాయిని తీసుకొస్తాం అని బదులిచ్చాడు. దీని ప్రకారం కొందరు వెనకడుగు వేస్తున్నా మరికొందరు సరే అంటూ అడ్రస్ చెప్పి అమ్మాయిలను రప్పించుకుంటున్నారని తెలిసింది. ఈ తరహా వ్యాపారం ఈ మధ్య కొత్తగా అమలు చేస్తున్నారు. గత 15 రోజుల క్రితం అక్కడక్కడా గోడలపై, పలు కాలనీల్లో పాంప్లేట్స్‌ను అతికించారు. ఈ తరహాలో గోడకు అతికించిన పాంప్లేట్స్ ‘దిశ’కు చిక్కాయి. ఇప్పుడు వెళ్లి చూస్తే ఆ పాంప్లేట్స్ మళ్ళీ కనిపించడం లేదు.
అమ్మాయికి 500.. బ్రోకర్‌కు 500
ఫోన్ ద్వారా సంప్రదించిన వ్యక్తి మరొక కొత్త డిమాండ్ ‘దిశ’ ప్రతినిధి ముందు ఉంచాడు. మేము తీసుకొచ్చే అమ్మాయికి రూ.500 ఇవ్వండి. తీసుకువచ్చినందుకు మాకు కూడా రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేసాడు. మీరు ఎక్కడికి అంటే అక్కడికి తెస్తున్నాం కదా అందుకే మాకు కూడా రూ.500 ఇవ్వాలని అడగడంతో సరే అని చెప్పగా అమ్మాయిని తేవడానికి సిద్ధమయ్యాడు. ప్రస్తుతం పాంప్లేట్ విధానంలో కొనసాగుతున్న వ్యాపారం రానురాను ఆన్లైన్ విధానానికి కూడా మారడానికి ఎక్కువ సమయం కూడా పట్టదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయమై కామారెడ్డి పట్టణ ఎస్.హెచ్ ఓ చంద్రశేఖర్ రెడ్డిని వివరణ కోరగా ఈ విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు. వస్తే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.