‘క్షమాపణ చెప్పకపోతే శవాలు కూడా దొరకవు’.. ఖమ్మంలో పొంగులేటికి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం

by Satheesh |   ( Updated:2023-07-01 08:28:42.0  )
‘క్షమాపణ చెప్పకపోతే శవాలు కూడా దొరకవు’.. ఖమ్మంలో పొంగులేటికి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం
X

దిశ బ్యూరో, ఖమ్మం: ఖమ్మం జిల్లా రాజకీయాలు హీటెక్కాయి. రేపు కాంగ్రెస్ కండువా కప్పుకోబోతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ శ్రీనివాస్ రెడ్డిని బెదిరిస్తూ పోస్టర్లు కలకలం రేపాయి. ఖబర్దార్ పొంగులేటి అంటూ ఖమ్మంలో గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు అతికించారు. మాజీ డీసీసీబీ ఛైర్మన్ మువ్వా విజయ్ బాబు నీకు మూడింది అంటూ హెచ్చరించారు. చీకటి కార్తీక్‌కు పట్టిన గతే మీకు పడుతుంది అంటూ వార్నింగ్ ఇచ్చారు.

మంత్రి పువ్వాడ అజయ్ కాళ్లు పట్టుకుని క్షమించమని అడగకపోతే మీ శవాలు కూడా దొరకవు అంటూ బెదిరించారు. మంత్రి అజయ్ మీద కావాలనే కొంత మంది కుక్కలు చెడు చేయడానికి చూస్తున్నారని పొంగులేటి అనుచరులమంటూ కొంతమంది మీడియాలో ప్రచారం కోసం దిగజారి మాట్లాడుతున్నారని వీరందరికి మూడింది అంటూ పోస్టర్లలో రాసుకొచ్చారు. జై బీఆర్ఎస్ అంటూ ఉన్న ఈ పోస్టర్లు ఖమ్మం పాలిటిక్స్‌లో కాకరేపుతున్నాయి.

తానేంటో చూపిస్తా: పొంగులేటి

తాను కాంగ్రెస్‌లో చేరుతున్నాననే అక్కసుతోనే నా అనుచరులను చంపి శవాలు లేకుండా చేస్తామని బీఆర్ఎస్ బెదిరిస్తోందని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ నేతల పోస్టర్లు దుర్మార్గం అని ఫైర్ అయ్యారు. తాను చెల్లని నాణెమా లేక గోల్డ్ కాయినా అనేది మూడు నెలల్లో బీఆర్ఎస్ నేతలకు చూపిస్తానన్నారు. తనను నమ్ముకున్న అనుచరులను కాపాడుకోవడం తప్పా అని ప్రశ్నించారు. తనను హెచ్చరిస్తూ వెలిసిన పోస్టర్లను చూపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్ని కుట్రలు చేసిన జనగర్జన సక్సెస్ చేస్తాం:

రేపటి ఖమ్మం జన గర్జన సభకు ఆటంకాలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని.. ఎవరెన్ని కుట్రలు చేసినా సభ సక్సెస్ చేస్తామని పొంగులేటి చెప్పారు. సభ కోసం 1500 బస్సులు కావాలని ఆర్టీసీని కోరితే సంస్థ నిరాకరించిందని, మరోవైపు మిషన్ భగీరథ ట్యాంకులు శుభ్రం చేస్తున్నామనే పేరుతో రాహుల్ సభ ముగిసేంత వరకు మంచినీళ్లు సరఫరా ఆపేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read More: పొంగులేటి వెంటే మా ప్రయాణం.. బీఆర్ఎస్ పార్టికి రాజీనామా చేసిన కౌన్సిలర్లు

Advertisement

Next Story

Most Viewed