TG Govt: డెడికేటెడ్ కమిషన్‌కు చైర్మన్‌ నియామకం

by Gantepaka Srikanth |   ( Updated:2024-11-04 16:32:08.0  )
TG Govt: డెడికేటెడ్ కమిషన్‌కు చైర్మన్‌ నియామకం
X

మ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల(BC Reservations)కు న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆదివారం డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేశారు. తాజాగా.. ఈ కమిషన్‌కు చైర్మన్‌(Commission Chairman)ను నియమించారు. విశ్రాంత ఐఏఎస్(IAS) బూసాని వెంకటేశ్వర రావు(Posani Venkateswara Rao)ను కమిషన్ చైర్మన్‌గా నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా, కులగణన సంబంధిత అంశాలపై సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు డెడికేటెట్ కమిషన్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. న్యాయస్థానాలు లేవనెత్తిన పలు అంశాలపై సీఎం తన నివాసంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ, ఎమ్మెల్సీ, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇతర ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా చర్చించి కమిషన్ ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో ఈ నెల 6 నుంచి సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి మరియు కుల సర్వే ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా, న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ఉండేందుకు కోర్టు తీర్పులను తప్పకుండా అనుసరించాలని సీఎం స్పష్టం చేశారు. నెల రోజుల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

Next Story

Most Viewed