రేవంత్ రెడ్డిని కలిసిన ప్రముఖ పాప్ సింగర్!.. ఎక్కడో తెలుసా?

by Ramesh Goud |   ( Updated:2024-04-21 14:41:54.0  )
రేవంత్ రెడ్డిని కలిసిన ప్రముఖ పాప్ సింగర్!.. ఎక్కడో తెలుసా?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రముఖ పాప్ సింగర్ స్మిత, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని విమానంలో కలిసినట్లు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. రేవంత్ రెడ్డితో కలిసిన ఫోటోను అభిమానులతో పంచుకుంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత ఎవరిని ఎక్కడ కలిశానో చూడండి అంటూ.. అత్యంత సాధారణ ముఖ్యమంత్రుల్లో రేవంత్ రెడ్డి ఒకరని, ఆయన అందరితో కలిసి కమర్షియల్ విమానంలోనే ప్రయాణిస్తున్నారని చెబుతూ.. విమానంలో ఆయన పక్కన కూర్చొని దిగిన ఫోటోను ఎక్స్ లో షేర్ చేశారు. కాగా పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్ రెడ్డిని పలు రాష్ట్రాలకు స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించడంతో.. ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఆయన వెళుతున్నారు.

Read More...

నిరూపిస్తే నా పేరిట ఉన్న గడీని CM రేవంత్ రెడ్డికి రాసిస్తా.. రఘునందన్ రావు సవాల్

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story